YSRCP MLA Roja : తిరుపతి ఉపఎన్నికలో టీడీపీకి ఓటమి ఖాయమైందని, జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. టీడీపీ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో భాగంగానే దొంగ ఓట్ల డ్రామా ఆడుతోందని ఆమె విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డిని వీరప్పన్ అన్న టీడీపీ నేత లోకేష్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రోజా వార్నింగ్ ఇచ్చారు. ఎర్రచందనం వీరప్పన్ కిషోర్ కుమార్ రెడ్డి.. ఆయన ఇప్పుడు మీ దగ్గర లేడా చంద్రబాబూ? కిశోరే కుమార్ అనే వీరప్పన్‌ని పెట్టి నువ్వు తిరుపతి ఉప ఎన్నిక చేయలేదా? అని రోజా ఎదురుదాడికి దిగారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని రోజా ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బయట ప్రాంతాల నుంచి జనాలను తరలించి దొంగ ఓట్లు వేయించిందని టీడీపీ నేత నారా లోకేష్ వరుస ట్వీట్లలో విమర్శలు చేసిన నేపథ్యంలో రోజా ఈ మేరకు కౌంటరిచ్చారు.
దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల తరలివచ్చిన వేలాది మందిని అరెస్ట్‌చేసి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలి.(5/5)#DemocracyMurderedInAP#YCPFakeVotesScam
— Lokesh Nara (@naralokesh) April 17, 2021