Chandrababu Naidu: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ అధినేత రోడ్‌షోలో కలకలం రేగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు సభలో రాళ్ల దాడి జరిగింది. తిరుపతి గాంధీ రోడ్డులో చంద్రబాబు ప్రచార సభ నిర్వహించారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాయి విసిరారు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు ఓ యువకుడికి గాయాలయ్యాయి. దీంతో చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గాంధీ రోడ్డులో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇంతలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారరని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు టీడీపీ కార్యకర్తలు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ముందుకు రండి తేల్చుంకుందాం అన్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా.. ఇక్కడే ఉంటా.. నేనేంటో చూపిస్తానంటూ ఆయన హెచ్చరించారు. రౌడీయిజం నశించాలంటూ నినాదాలు చేశారు చంద్రబాబు. తన ర్యాలీపై రాయి విసరడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. అక్కడే బైఠాయించారు. రాయి విసిరింది ఎవరో తేలాలని డిమాండ్ చేశారు. పోలీసులు సర్ది చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ ఆఫీసుకు వెళ్లారు చంద్రబాబు.
అనంతరం గాయపడిన వారితో చంద్రబాబు మాట్లాడారు. ఇది పిరికిపంద చర్య అని.. పోలీసుల వైఫల్యమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు రక్షణ లేకపోతే ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న తనకు రక్షణ కల్పించలేరా అని చంద్రబాబు మండిపడ్డారు. ఇక రాయి దాడి ఘటనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Read Also… Sushil Chandra: దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుశీల్ చంద్ర.. రేపు బాధ్యతలు చేపట్టనున్న సీఈసీ
తిరుమలలోనే అంజనీపుత్రుడు హనుమంతుడు జన్మించాడా? మరి దేశంలోని మిగతా ప్రజల విశ్వాసమేమిటి..?
66 ఏళ్ల వయసులో కూడా ఏంటీ ఎనర్జీ. ఏంటీ గ్రేస్.. నెట్టింట వైరల్‌గా మారిన రేఖ డ్యాన్స్ వీడియో