TTD: టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు భారీగా విరాళాలు.. రూ.2 కోట్ల విరాళాలు అందజేసిన…

టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు ఆదివారం రూ.2 కోట్లు విరాళంగా అందాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చెన్నైకి చెందిన పొన్‌ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఈ విరాళాలు ఇచ్చాయి. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరిని ఆయా సంస్థల చెక్కులు ఆందజేశాయి.

TTD: టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు భారీగా విరాళాలు.. రూ.2 కోట్ల విరాళాలు అందజేసిన...
Ttd

Updated on: Apr 28, 2025 | 8:13 AM

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నడిచే ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు దాతలు రూ.2 కోట్లు విరాళంగా అందజేశారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద రూ.1.50 కోట్ల విరాళాలు అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థ జోనల్‌ హెడ్‌ ధారాసింగ్‌ నాయక్‌, రీజనల్‌ హెడ్‌ వెంకటేశ్వర్లు తిరుమలలో అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి రూ.1.50 కోట్ల చెక్‌ను అందజేశారు.

చెన్నైకి చెందిన పొన్‌ప్యూర్‌ కెమికల్‌ ఇండియా సంస్థ కూడా టీటీడీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.50 లక్షలు విరాళంగా అందించింది. ఆ సంస్థ సీఎండీ ఎం.పొన్నుస్వామి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం.పి.సూర్యప్రకాష్‌ అదనపు ఈవో వెంకయ్యచౌదరిని కలిసి విరాళం చెక్కును అందజేశారు. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ప్రకటించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నడిచే ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ఒక ప్రతిష్ఠాత్మక సేవా కార్యక్రమం, దీని లక్ష్యం నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం. ఈ టస్ట్ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు అందించే విరాళాల ద్వారా నిర్వహించబడుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…