టీటీడీ అగరబత్తులు అందుబాటులోకి వచ్చాయి. తయారీ కేంద్రాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. స్వామివారి సేవల్లో ఉపయోగించే పుష్పాలు వృథాగా పోకుండా అగరబత్తీలు తయారీ చేపట్టారు. ఇందుకోసం దర్శన్ ఇంటర్నేషనల్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. టీటీడీ బ్రాండ్ నేమ్ తో ఏడు రకాల అగరబత్తీలను తయారు చేస్తున్నారు. టీటీడీ తన సొంత అవసరాల కోసం అగరబత్తీలను వినియోగించుకోవడంతో పాటు మార్కెట్‌లో కూడా వాటిని విక్రయించబోతోంది. అగరబత్తీలను తయారు చేయడానికి ప్రత్యేకంగా ఓ యూనిట్‌ను కూడా టీటీడీ అధికారులు నెలకొల్పారు. తిరుపతి ఎస్వీ గోశాలలో పది యంత్రాలతో రోజుకి మూడున్నర లక్షల అగరబత్తీలను తయారు చేస్తున్నారు. ముందుగా పుష్పాలను గ్రేడింగ్ చేసి, ఎండబెట్టి, పిండిగా మార్చుతారు. ఆ పిండికి వాటర్ మిక్స్ చేసి అగరబత్తీలు రూపొందిస్తారు. ఇలా సిద్ధమైన అగరబత్తీలను 16గంటలపాటు ఆరబెట్టి, ఆకర్షణీయమైన డిజన్లతో ప్యాకింగ్ చేస్తారు. 65 గ్రాముల ఫ్లోరా అగరబత్తులు 125 రూపాయలు, 100 గ్రాముల సాధారణ అగరబత్తులు 60 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు.
7 రకాల వైవిధ్యభరితమైన సువాసనల్లో ఈ అగరబత్తీలు లభిస్తాయి. తందనాన, దివ్యపాద, అభయహస్త, దివ్య దృష్టి, దివ్య సృష్టి, ఆకృష్టి, తుష్టి అనే పేర్లతో ఈ ఏడు రకాల అగరబత్తీలు మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. తాము అగరబత్తీలను బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో విడుదల చేయట్లేదని, శ్రీవారి సేవలు, అలంకరణ కోసం వినియోగించిన పుష్పాలకు సంబంధించిన పరిమళాలు ప్రతి ఇంటిలోనూ వెదజల్లాలనే కారణంతో వాటిని తయారు చేశామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రజంట్ తిరుమల, తిరుపతిల్లో ఎంపిక చేసిన కౌంటర్లు, దేవాలయాల్లో విక్రయిస్తారని సమాచారం. ఉత్పత్తి భారీ ఎత్తున చేపట్టిన తరువాత.. వాటి విక్రయాలను మరింత విస్తరించే ఛాన్స్ ఉంది.
Also Read: భార్య మరణం.. చిరు ముందు గుండెలవిసేలా రోధించిన ఉత్తేజ్… ప్రకాశ్ రాజ్ కంటతడి
రూ.40 వేలకే కేటీఎం, రూ.35 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఏంటా అని ఆరా తీయగా పోలీసులు షాక్