Tirupati: శ్రీవారి భక్తులకు గమనిక.. ఆ ధరలు ఏకంగా 5 రెట్లు పెంపు!

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రసాదం రేట్లు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం.. తిరుపతిలో భక్తులకు ప్రసాదంగా అందించే..

Tirupati: శ్రీవారి భక్తులకు గమనిక.. ఆ ధరలు ఏకంగా 5 రెట్లు పెంపు!
Srivari Temple

Updated on: Feb 23, 2022 | 12:48 PM

Tirumala Tirupati Devasthanams (TTD) has hiked the price of Jilebi Prasadam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రసాదం రేట్లు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం.. తిరుపతిలో భక్తులకు ప్రసాదంగా అందించే జిలేబీ రేట్లు (Jilebi Prasadam) గతంలో రూ.100లు ఉండగా ప్రస్తుతం రూ.500లకు పెరిగినట్లు దేవస్థానం ప్రకటించింది. అర్జిత సేవలను తిరిగి ప్రారంభించిన తర్వాత ప్రసాదం రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఐతే ఈ గురువారం మాత్రం భక్తులకు ఓపెన్‌ కౌంటర్ల ద్వారా ప్రత్యేకంగా ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేసింది. కాగా 2021 జూన్‌లో బ్లాక్‌ మార్కెట్‌లో ప్రసాదాన్ని ఏకంగా రూ. 2 వేల రూపాయలకు విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ విధమైన అక్రమ పంపిణీ దారులకు స్వస్తి పలికేందుకే ధరలను పెంచాలని టీటీడీ ఉన్నతాధికారులు ట్రస్ట్‌ బోర్డుకు ప్రతిపాదనలు చేశారు. చర్చల అనంతరం ప్రసాదం రేట్లను రూ.500లకు పెంచుతున్నట్లు టీటీడీ ట్రస్ట్‌ బోర్డు వెల్లడించింది. దీంతో శ్రీవారి దేవస్థానానికి 239 శాతం అదనపు ఆధాయం రానుంది.

ఐతే లాభాపేక్షతో టీటీడీ ట్రస్ట్‌ బోర్డు ప్రసాదం ధరలను పెంచిందని ఏపీ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మాన్‌ పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో తిరుపతి దేవస్థానం ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ సబ్సిడీకి ప్రసాదాలను పంపిణీచేయడానికి బదులు ధరలను పెంచి లాభం పొందాలని చూస్తోంది. ప్రసాదం తయారీ ఖర్చు కంటే ధరలే ఎక్కువని, ఇది చాలా అన్యాయమని అన్నారు. టీటీడీ మాజీ ట్రస్ట్ బోర్డు సబ్యుడు జి భానుప్రకాశ్‌ రెడ్డి కూడా ధరల పెంపును తప్పుబట్టాడు. భక్తులకు సబ్సిడీపైనే ప్రసాదం పంపిణీ చెయ్యాలి. డిమాండ్‌ అధికంగా ఉండటంతో ధరలను పెంచిందని వ్యాఖ్యానించారు.

Also Read:

NTPC jobs: గేట్‌ 2021 స్కోర్ ఆధారంగా.. ఎన్టీపీసీలో 40 ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఉద్యోగాలు!