
టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 55 కీలక అంశాలపై చర్చించి ఆమోద్ర ముద్ర వేసింది టీటీడీ బోర్డు. ప్రధానంగా.. తిరుమల కొండపై పచ్చదనం పెంపునకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఏపీ అటవీ శాఖ ఆధీనంలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో ఆ శాఖకు 4 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. టీటీడీ ఉప ఆలయాల సమగ్ర అభివృద్ధికి, తిరుమల కాలినడక మార్గాల్లో సౌకర్యాల కల్పనకు కమిటీలు వేసింది.
తిరుమలలోని 42 వీఐపీ అతిథి గృహాలకు గతంలో వేర్వేరు కంపెనీల పేర్లు ఉండగా.. వాటికి నిర్వాహకులే ఆధ్యాత్మిక పేర్లు పెట్టినట్లు టీటీడీ ప్రకటించింది. మరో రెండు, మూడు అతిథి గృహాలను పేర్లను టీటీడీ మార్చనున్నట్లు తెలిపింది. ఇక.. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ రిపోర్ట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదముద్ర వేసింది. స్విమ్స్ ఆస్పత్రిలో 597 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు శ్రీవారి ఆలయంలోని తులాభారం కానుకల్లో అవినీతి జరిగిందని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్‌రెడ్డి.. విజిలెన్స్ ఎస్పీకి ఫిర్యాదు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ అంశం టీటీడీ పాలకమండలి సమావేశంలోనూ చర్చకు వచ్చింది. తులాభారం కానుకల్లో స్కామ్‌పై విజిలెన్స్ విచారణ ప్రారంభమైందన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఈ అంశాన్ని విజిలెన్స్ సీఎస్‌వో స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..