
Tirupati MLA Bhumana police complaint : దేశానికి మార్గనిర్దేశం చేయాల్సిన యువత గంజాయి మత్తులో తూగుతుంటే ఎమ్మెల్యేగా తల్లడిల్లిపోయానన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి పవిత్ర నగరంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని ఆయన చెప్పారు. డ్రగ్స్ కి బానిసలైన యువకులు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలకు సైతం ఈ మత్తు అలవాటు చేసి వారిని వల్లో వేసుకుని పశు వాంఛ తీర్చుకుంటున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ అంశంపై ఆయన తిరుపతి అర్బన్ ఎస్పీకి ఇవాళ ఫిర్యాదు చేశారు. సైకిల్ పై సామాన్యుడిగా తిరుపతి వీధుల్లో తిరుగుతుంటే గంజాయి మత్తులో ఉన్న యువకుల్ని చూశానని.. తిరుపతి లో గంజాయి అమ్మకాలను అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోలీసుల్ని కోరారు. ఈ మేరకు భూమన మూడు పేజీల ఫిర్యాదుని స్వయంగా ఎస్పీ అప్పలనాయుడికి ఇచ్చారు.
Bhumana
Read also : Covid situation review : మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ.. పలు కీలక అంశాలపై నిర్ణయాలు