Tirumala: పండుగ సెలవుల్లో తిరుమల వెళ్లేవారికి అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు.. టీటీడీ అనౌన్స్‌మెంట్

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వరుస సెలవుల కారణంగా అనూహ్యంగా పెరిగింది. దీంతో టీటీడీ దర్శనాల విషయంలో అనేక జాగ్రత్తలు చేపడుతోంది. వినాయకచవితి పండుగల సెలవుల కారణంగా రద్దీ పెరగడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వివరాలు..

Tirumala: పండుగ సెలవుల్లో తిరుమల వెళ్లేవారికి అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు.. టీటీడీ అనౌన్స్‌మెంట్
Tirumala

Updated on: Sep 11, 2026 | 6:58 AM

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వరుస సెలవులు రావడం, వినాయక చవితి పండుగల సెలవుల కారణంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. దీంతో రద్దీ ఒక్కసారిగా పెరగడంతో టీటీడీ రంగంలోకి దిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. శనివారం, ఆదివారం, వినాయక చవితి పండుగతో వరుసగా మూడు రోజులు సెలవులు వస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తోంది. దీంతో అనూహ్యంగా ఊహించని రీతిలో రద్దీ పెరగడంతో టీటీడీ చర్యలు చేపట్టింది. ఎక్కువమంది సాధారణ భక్తులకు దర్శన సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో వీఐపీ దర్శనాలను రద్దు చేసింది. ఆదివారం ఒక్కరోజున వీఐపీ దర్శనాలను రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సూచించింది.

ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వరుస సెలవుల కారణంగా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనానికి వచ్చే అవకాశముందని టీటీడీ అంచనా వేసింది. దీంతో సెప్టెంబర్ 13వ తేదీన వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 12వ తేదీన సిఫార్సు లేఖలు స్వీకరించమని, వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయిస్తామని స్పష్టం చేసింది. అయితే భక్తుల రద్దీ సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తూ ఉంటుంది. సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. అటు తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా దీనికి ప్రారంభోత్సవం జరగనుంది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభించనున్నారు. అటు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డ్ సృష్టించింది. ఏకంగా రూ.6.93 కోట్ల కానుకలు వచ్చాయి. బుధవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు వచ్చిన కానుకలను లెక్కించగా.. రికార్డు స్థాయిలో వచ్చాయి. టీటీడీ చరిత్రలోనే ఇప్పటివరకు మూడుసార్లురూ.6 కోట్లకకుపైగా హుండీ ఆదాయం వచ్చింది. కొందరు అజ్ఞాత భక్తులు హుండీలో భారీగా కానుకలు వేయడంతో ఈ రికార్డు నమోదైనట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. క్యూలైన్లు, కాంప్లెక్స్‌లు భక్తులతో నిండిపోయాయి. ఇక సెప్టెంబర్‌ 14న సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ తొమ్మిది రోజుల పాటు పలు ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us