Tirumala Tirupati: వారికి ఆ దర్శనాలను ఇంకా పునరుద్దరించలేదు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ

|

Oct 19, 2021 | 3:12 PM

Tirumala Tirupati: కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేసిన విషయం..

Tirumala Tirupati: వారికి ఆ దర్శనాలను ఇంకా పునరుద్దరించలేదు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
Follow us on

Tirumala Tirupati: కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కోవిడ్‌ తగ్గుముఖం పట్టినా.. పూర్తి స్థాయిలో మాత్రం అదుపులోకి రాలేదు. దీంతో వీరి దర్శనాల విషయంలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే గ‌త కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా వేదికగా వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను పునరుద్దరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పుకార్లను నమ్మి చాలా మంది నమ్మి తిరుపతికి వ‌చ్చి ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంది.

దీనిపై స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం.. సామాజిక మాధ్యమాల ద్వారా ఇలాంటి పుకార్లను నమ్మవద్దని తెలిపింది. కోవిడ్ పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత వారి దర్శనాల పునరుద్దరణపై నిర్ణయం తీసుకుని మీడియా ద్వారా తెలియజేస్తామని స్పష్టం చేసింది. అధికారుల నుంచి ప్రకటన వెలువడే వరకు ఇలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని టీటీడీ కోరుతోంది.

కాగా, గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. భక్తులకు దర్శనాలను సైతం నిలిపివేయబడ్డాయి. తర్వాత కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి దర్శనాలను ప్రారంభించారు. అయితే వృద్ధులు, పిల్లల తల్లిదండ్రుల విషయంలో ఇంకా ప్రత్యేక దర్శనాలను ఇంకా పునరుద్దరించలేదు.

ఇవీ కూడా చదవండి:

Temple Assets: రూ. 951 కోట్ల ఖర్చుపై ఆడిట్ అభ్యంతరాలు.. ఏపీలోని ఆలయాల ఆదాయ అక్రమాలపై చర్యలకు సిద్ధం

Chanakya Niti: ఇలాంటి శత్రువులతో జాగ్రత సుమీ.. అలాంటివారి పట్ల ఏమరపాటు అసలే వద్దు..