Special Trains To Tirupati : వేసవి సెలవుల్లో తిరుపతి, తిరుమల వెళ్లాలనుకునేవారు చాలామందే ఉంటారు. అందుకోసం ముందస్తు గానే రైల్వే టికెట్లు బుక్ చేసుకునేందుకు ఎగబడుతుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్ల మీదుగా తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ సమ్మర్ స్పెషల్ రైళ్ల సంఖ్యను మరింత పెంచుతోంది. ఇందులో భాగంగా ఈ (ఏప్రిల్8) న రాత్రి 8 గంటలకు 07597 నంబరు గల రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలు దేరి నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా రేపు (ఏప్రిల్9) ఉదయం 7.50 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అదేవిధంగా ఏప్రిల్ 10న రాత్రి 7.50 గంటలకు 07597 నంబరు గల రైలు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది.
ఇవి కూడా..
వీటితో పాటు కర్ణాటకలోని బీజాపూర్- తిరుపతిల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది దక్షిణ మధ్య రైల్వే. రేపు (ఏప్రిల్9)న 07697 నంబర్ గల రైలు ఉదయం 9.40 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంది. రేణిగుంట, రైల్వే కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, బళ్లారి, తొరనగల్లు, హోస్పేట, మునిరాబాద్, కొప్పల్, గడగ్, హోలే ఆలూర్, బదామి, బాఘల్ కోట్, ఆల్మట్టి, బసవ బాగేవాడి రోడ్ స్టేషన్ల మీదుగా అదే రోజు రాత్రి 11.30 గంటలకు బీజాపూర్ చేరుకుంటుంది. అదేవిధంగా ఏప్రిల్ 10న 07698 నంబర్ గల రైలు ఉదయం 5 గంటలకు బీజాపూర్ నుంచి బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతికి వెళ్లాలనుకునేవారు ఈ సమ్మర్ స్పెషల్ రైళ్ల సర్వీసులను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
Summer #SpecialTrains @drmsecunderabad @drmhyb @drmgtl pic.twitter.com/FU1rtIWRBL
— South Central Railway (@SCRailwayIndia) April 7, 2022
Summer Special Trains between #Tirupati and #Bijapur pic.twitter.com/XzRsGPHHFN
— South Central Railway (@SCRailwayIndia) April 8, 2022
Also Read: Sonu Sood: సోనూసూద్‌కు మరో అరుదైన గౌరవం.. కృతజ్ఞతలు తెలిపిన రియల్ హీరో..
దొంగోడిని పట్టించిన గూగుల్ మ్యాప్ !! పోలీసులు వెళ్లి చూడగా ఫ్యూజులు అవుట్ !!