Srivari special darshan tickets : దేవదేవుడు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి రేపు ఉదయం 9 గంటలకు జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. కరోనా నేపథ్యంలో రోజుకు 5వేల చొప్పున టికెట్లను మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయంచింది. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ల నేపథ్యంలో తిరుమల కొండపై భక్తుల తాకిడి భారీగా తగ్గింది. అనునిత్యం 60 వేల మందికి పైగా భక్తులతో కళకళలాడే తిరుమల ఇప్పుడు భక్తులు లేక బోసిపోతోంది. గత మూడు రోజులుగా కేవలం ఐదు వేల లోపు భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమలకు భక్తులు ఎక్కువగా రావడం లేదు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా బాగా తగ్గింది.