pawan kalyan: వర్షంలోనూ ఆగని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన్ తిరుపతిలో కొనసాగుతునే ఉంది. జిల్లాలో వర్షం పడుతున్న అవేం పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగిస్తున్నారు.

pawan kalyan: వర్షంలోనూ ఆగని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన

Updated on: Dec 04, 2020 | 1:51 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన్ తిరుపతిలో కొనసాగుతునే ఉంది. జిల్లాలో వర్షం పడుతున్న అవేం పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగిస్తున్నారు. తొట్టంబేడు మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పొయ్య గ్రామంలో రైతులతో జనసేనాని ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన పర్యటనను వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్తూరు జిల్లా మొత్తం వైసీపీ తన జాగీరు అనుకుంటోంది అని, జన సైనికుల మీద చేయ్యి వేస్తే చూస్తూ ఊరుకోనని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని, వరద బాధిత రైతులను జనసేన పరామర్శిస్తుంటే వైసీపీ ఎందుకు భయపడుతోందని వవన్ ప్రశ్నించారు.