రాజ్యాంగ విధి, ధర్మాన్ని అనుసరిస్తున్నాను : ఎస్వీ యూనివర్సిటీలో మీడియాతో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

|

Feb 04, 2021 | 4:21 AM

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరగాల్సిన సరైన సమయమిదేనని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ప్రజల్లో నిరాతప్తత, నిర్లిప్తత..

రాజ్యాంగ విధి, ధర్మాన్ని అనుసరిస్తున్నాను : ఎస్వీ యూనివర్సిటీలో మీడియాతో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరగాల్సిన సరైన సమయమిదేనని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ప్రజల్లో నిరాతప్తత, నిర్లిప్తత రాకూడదన్న ఆయన, రాజ్యాంగ విధి, ధర్మాన్ని అనుసరిస్తున్నానని చెప్పారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఆయన మీడియాతో మాట్లాడారు. “స్వేచ్చాయుతమైన వాతావరణంలో ప్రజలు ఓట్లేయాలి. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లా యంత్రాంగం పై పూర్తి నమ్మకం ఉంది. ఏకగ్రీవాలు వద్దని చెప్పడంలేదు. అసమంజసంగా ఏకగ్రీవాలు జరపాలని నిర్ణయించుకోవడం సరైంది కాదు. ఇది వ్యవస్థకు మంచిది కాదు.” అని నిమ్మగడ్డ అన్నారు.

“ఎన్నికలు జరిగితే గ్రామాలు విడి పోతాయన్న వాదన సరైంది కాదు. ఇంటికి పునాది లాంటిదే గ్రామపంచాయతీ. రాజ్యాంగం ఇచ్చిన అధికారం మేరకు పరిమిత బాధ్యత తో వ్యవహరిస్తున్నాను. స్వీయ నియంత్రణలో నేను ఉంటాను. రాజ్యాంగం ఇచ్చిన విశేషాధికారాలుతోనే ఎన్నికలు సక్రమంగా జరిగేలా జిల్లా అధికారుల్లో జవాబుదారితనం తీసుకొస్తాను. జవాబుదారీతనం లేని వారిలో జవాబుదారీతనాన్ని తీసుకురావడమే నా పని. అందరిలో నమ్మకం కలిగించేలా పనిచేస్తాను.” అని నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు.

అంతేకాదు, “రష్యా లాంటి పరిస్థితులు మన దేశంలో లేవు. మెరుగైన సమాజం దిశగా మన ప్రయాణం జరుగుతోంది. పంచాయతీ ఎన్నికలు చిన్నవి అన్న చిన్న చూపుతో మీడియా చూడొద్దు. మార్షల్ మెట్లో హాన్ అన్నట్లు మీడియా బలంగా ఉన్న చోట ప్రజాస్వామ్య వాణి బలంగా ఉంటుందని చెప్పారు.” అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.

” రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్ళి ఎన్నికలపై సమీక్ష చేస్తున్నాను. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని నెలల్లోనే తమిళనాడు సహా మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించి నాకు రిటైర్మెంట్ గిఫ్ట్ ఇస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. ఏపీలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రజలకు ఎప్పుడూ ఎన్నికలంటే భయం ఉండకూడదు. స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితిని వారికి కల్పించాలి.” అని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

“చిత్తూరులో గత ఎన్నికల సమయంలో కొన్నిచోట్ల అధికారులు తప్పులు చేసిన మాట వాస్తవమే. గతంలో చిత్తూరు జిల్లాలో జరిగిన ఏకగ్రీవాలపై గుడ్డిగా నిర్ణయం తీసుకోము. బాగా పరిశోధన చేసి నిర్ణయం తీసుకుంటాం. నేనెప్పుడూ ఏ రాజకీయ నాయకున్ని ఒక్క మాట అనలేదు. అది నా నైజం కాదు. ఎన్నికల యాప్ తీసుకురావడం ద్వారా కొత్త వ్యవస్థను సృష్టించాం. ఫిర్యాదు చేసిన వెంటనే తక్షణం స్పందిస్తాము.” అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం రాజ్యమేలుతోంది: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలుగుదేశం ఎంపీల ఫిర్యాదు

ఒక మహిళ రూ. 10 వేలతో వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ ఉంది. ఆమె మరెవరోకాదు, నీతా అడప్పా. ఒక బ్రాండ్