‘ప్రేమ పెళ్లి చేసుకుని తప్పుచేశా..’ ఇద్దరు పిల్లలకు ఉరేసి తల్లి సూసైడ్‌!

ఇంట్లో పెద్దొళ్లను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఓ గుణపాఠం. లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నా.. నా భర్తకు అన్ని అవలక్షణాలు ఉన్నాయి. అప్పులు చేసి తీర్చలేనని చేతులెత్తేశాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న పాపానికి నేను, నా కడుపున పుట్టిన పిల్లలు కష్టాన్ని అనుభవిస్తున్నాం. ఇక చాలు.. నేను చనిపోయాక ఎలాగూ రెండో పెళ్లి చేసుకుంటావ్‌.. ! ఈసారైన లైఫ్‌ సెటిలైన తర్వాత చేసుకో.. అని సూసైడ్‌ లేఖ రాసి ఇద్దరు పిల్లలకు ఉరి వేసి, ఆత్మహత్య చేసుకుందో ఇల్లాలు..

ప్రేమ పెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలకు ఉరేసి తల్లి సూసైడ్‌!
Mother, Two Children Found Dead By Suicide In Tirupati

Edited By:

Updated on: Feb 08, 2026 | 6:44 AM

పుత్తూరు, ఫిబ్రవరి 8:  తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణం కృష్ణానగర్‌ 3వ వీధిలో శనివారం రాత్రి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. డీఎస్పీ జి.రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణానగర్‌లో నివసిస్తున్న శివశంకర్, పద్మజ (27) ఒకే కాలేజీలో డిగ్రీ చదువుతూ ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు కావడం, శివశంకర్‌ పని లేక జులాయిగా తిరుగుతున్నాడని పద్మ తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి తేజశ్రీ (7), లాస్య (4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో తేజశ్రీ 2వ తరగతి, లాస్య యూకేజీ చదువుతోంది. శివశంకర్‌కి ఉద్యోగం లేకపోవడంతో శనివారం ఉదయం శ్రీసిటీ లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లాడు.

మధ్యాహ్నం 2.30 గంటలకు పిల్లలను తీసుకెళ్లాలని పాఠశాల నుంచి శివశంకర్‌కు ఫోన్‌ రావడంతో తాను ఇంటర్వ్యూలో ఉన్నానని చెప్పాడు. తెలిపిన వారిని పిల్లలను తీసుకెళ్లాలని చెప్పాడు. వారు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో పద్మజ ఎదురెళ్లి పిల్లలను తీసుకెళ్లింది. సాయంత్రం ఇంటికి చేరుకున్న శివశంకర్‌ ఇంటి తలుపులు కొట్టినా ఎంతకూ తీయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికిలోనుంచి చూడగా ఉరి కొయ్యకు ముగ్గురూ వేళాడుతూ కనిపించారు. వెంటనే తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లగా తల్లీ కుమార్తెలు విగత జీవులుగా కనిపించారు. సమాచా రం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనంచేసుకున్నారు.

సంఘటనా స్థలంలో దొరికిన సూసైడ్‌ లేఖ ద్వారా.. శివశంకర్‌ జులాయని, ఏ పని చేయకుండా అప్పులు చేస్తున్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం శివశంకర్‌ను పెద్ద మనుషులు మందలించారని స్థానికులు సైతం తెలిపారు. శనివారం డ్వాక్రా లోన్‌ డబ్బు కట్టావా అని భర్తను ప్రశ్నించగా.. అతడు కట్టలేదని చెప్పాడు. దీంతో మనస్తాపం చెంది సూసైడ్‌ లేఖ రాసి, బెడ్‌ రూమ్‌లో ఇద్దరు పిల్లలకు ఉరేసి చంపింది. అనంతర హాల్‌లో తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు శివశంకర్‌ను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ రవికుమార్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.