Tirumala: తిరుమలను కమ్మేసిన పొగమంచు.. ఘాట్‌రోడ్లలో వాహనదారులకు ఇబ్బందులు

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలను పొగమంచు కమ్మేసింది. పొగమంచు, వర్షంతో తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పొగమంచుతో నిండి.. ప్రకృతి రమణీయంగా కనిపించిన తిరుగిరులను చూసి భక్తులు మైమరిచిపోయారు. అయితే.. దట్టమైన పొగమంచు కారణంగా ఘాట్‌రోడ్లలో వాహనదారులు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

Tirumala: తిరుమలను కమ్మేసిన పొగమంచు.. ఘాట్‌రోడ్లలో వాహనదారులకు ఇబ్బందులు
Thirumala

Updated on: Dec 16, 2023 | 1:12 PM

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలను పొగమంచు కమ్మేసింది. పొగమంచు, వర్షంతో తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పొగమంచుతో నిండి.. ప్రకృతి రమణీయంగా కనిపించిన తిరుగిరులను చూసి భక్తులు మైమరిచిపోయారు. అయితే.. దట్టమైన పొగమంచు కారణంగా ఘాట్‌రోడ్లలో వాహనదారులు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చే భక్తులు వర్షంలో తడుస్తూ గదులకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు.. చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అకస్మాత్తుగా తిరుమలలో రద్దీ కూడా పెరగడంతో భక్తులకు ఇబ్బందులు తప్ప లేదు.

పొగమంచు, వర్షం నేపథ్యంలో సొంత వాహనాల్లో ఘాట్‌రోడ్డులో ప్రయాణించేవారిని అలిపిరి దగ్గర టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేసింది. ఘాట్‌రోడ్లలో రహదారి మరమ్మతు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా వెళ్లాలని సూచించారు. మరోవైపు.. పొగమంచు, వర్షం కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను తాత్కాలికంగా టీటీడీ మూసివేసింది. ఆయా మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.