శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం.. టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ బదిలీ!

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వానికి అందిన సిట్ నివేదిక తర్వాత ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా ఉన్న ముద్దాడ రవిచంద్రను టిటిడి ఈఓ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం.. టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ బదిలీ!
Ttd Eo Anil Singhal Transferred

Updated on: Feb 01, 2026 | 3:15 PM

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్‌ అధికారుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ గతంలో ఈఓ గా పనిచేసిన సమయంలోనే నెయ్యి కొనుగోలు నిబంధనల్లో సడలింపులు ఇచ్చినట్టు విచాణలో తేలిందని సిట్‌ తన నివేదికలో పేర్కొంది. సింఘాల్ పైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిట్‌ సిఫార్స్ చేసిన చేసింది. సిట్ నివేదిక ఆధారంగా ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆయన స్థానంలో ప్రస్తుతం సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రను టీటీడీ నూతన ఈవోగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ప్రభుత్వం జారీ చేసింది. అయితే ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించే వరకు టీటీడీ ఇంచార్జ్ ఈఓగా వెంకయ్య చౌదరికి బాధ్యతలను అప్పటించింది ప్రభుత్వం. ఇదిలా ఉండగా సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్ర బదిలీతో CMO లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us