Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SVBC Employees: తిరుమలలో పోర్న్ వీడియో లింక్ వివాదం.. మరో ఇద్దరు ఎస్వీబీసీ ఉద్యోగులపై వేటు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో నడిచే శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ లో పోర్న్ వీడియో లింక్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఘటనలో మరో ఇద్దరు ఎస్వీబీసీ ఉద్యోగులపై వేటు పడింది.

SVBC Employees: తిరుమలలో పోర్న్ వీడియో లింక్ వివాదం.. మరో ఇద్దరు ఎస్వీబీసీ ఉద్యోగులపై వేటు
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 22, 2021 | 7:41 AM

svbc employees: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో నడిచే శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ లో పోర్న్ వీడియో లింక్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఘటనలో మరో ఇద్దరు ఎస్వీబీసీ ఉద్యోగులపై వేటు పడింది. అశ్లీల దృశ్యాల లింక్‌ ఘటనలో ఇప్పటివరకు 10 మందిపై టీటీడీ చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన టీటీడీ.. సైబర్‌ సెక్యూరిటీ నిఘా విభాగంతో విచారణ చేపట్టింది. ఉద్యోగం నుంచి తొలగించిన ఉద్యోగుల కంప్యూటర్లలో అశ్లీల దృశ్యాలు ఉన్నట్లు గుర్తించింది.

ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రసారమయ్యే శతమానం భవతి కార్యక్రమ వివరాల కోసం వెంకటకృష్ణ అనే భక్తుడు గతేడాది నవంబరులో ఛానల్‌కు మెయిల్‌ చేశారు. అయితే ఆ మెయిల్‌కు కార్యక్రమ వివరాలు పంపాల్సిన ఛానల్‌ ఉద్యోగులు దానికి బదులు నీలి చిత్రాలకు సంబంధించిన పోర్న్‌ సైట్‌ లింక్‌ పంపించారు. దీంతో గత ఏడాది నవంబరు 6న టీటీడీ ఈవోకు సదరు భక్తుడు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయాలని టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు టీటీడీ ఈవో.

కాగా, విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా అప్పట్లోనే ఆరుగురు ఉద్యోగులను ఎస్వీబీసీ యాజమాన్యం తొలగించింది. మరో ముగ్గురు ముఖ్య అధికారుల పాత్రపై టీటీడీ ఈవో ఈ ఏడాది జనవరి 2న నలుగురు సీనియర్‌ అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ముగ్గురు అధికారులను ఉద్యోగాల నుంచీ తొలగిస్తూ ఎస్వీబీసీ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదే క్రమంలో ఎస్వీబీసీలో మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఆఫీస్‌ కంప్యూటర్‌లో కూడా కొన్ని అసభ్యకర వీడియోలు, ఫొటోలతో పాటు సినిమాలున్నట్టు తేలడంతో అతన్ని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, ఎస్వీబీసీలో ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్న మిట్టపల్లి రవికిరణ్‌ ఇటీవల ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా వ్యవహారంలో పట్టుబడ్డాడు. పోలీసుల నివేదిక ఆధారంగా అతన్ని కూడా ఎస్వీబీసీ నుంచి తొలగించారు. రవికిరణ్‌పై గతంలో క్రిమినల్‌ కేసులు కూడా ఉన్నట్టు పోలీసుల నివేదికలో తేలింది.

Read Also…  Corona Vaccine: ఏపీ ఆరోగ్య శాఖ షాకింగ్ న్యూస్.. ఇవాళ మొదటి డోస్ వ్యాక్సిన్ నిలిపివేత.. రెండో డోస్ మాత్రమే.. కారణం అదేనా?