తిరుపతి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ న్యూస్‌.. ఈ రూట్లలో 8 ప్రత్యేక రైళ్లు..

వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ప్రజలు తిరుపతి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ, ట్రైన్ టిక్కెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేకరైళ్లు మార్గమధ్యంలో సనత్‌నగర్‌, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూరు, సెడాం, యాద్గిర్‌, కృష్ణ, రాయచూర్‌, మంత్రాలయం, ఆదోని, గుంతకల్‌, గుత్తి, తాడిపర్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట్‌, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని వెల్లడించారు.

తిరుపతి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ న్యూస్‌.. ఈ రూట్లలో 8 ప్రత్యేక రైళ్లు..
Special Trains To Tirupati

Updated on: Apr 30, 2025 | 11:39 AM

తిరుపతి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతికి 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దీగా ఉండే వేసవి నెలల్లో ప్రయాణికులకు ఎక్కువ సౌలభ్యం, సౌకర్యాన్ని అందించడం ఈ ప్రత్యేక రైళ్ల లక్ష్యం. ఈ మేరకు మే 8 నుంచి 29 వరకు ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి (07257) అలాగే మే 9 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి చర్లపల్లి జంక్షన్‌కు (07258) స్పెషల్ ట్రైన్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ప్రత్యేకరైళ్లు మార్గమధ్యంలో సనత్‌నగర్‌, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూరు, సెడాం, యాద్గిర్‌, కృష్ణ, రాయచూర్‌, మంత్రాలయం, ఆదోని, గుంతకల్‌, గుత్తి, తాడిపర్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట్‌, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..