
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు రైలు ప్రయాణికులకు తాత్కాలికంగా ఇబ్బందిగా మారాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న డ్రైనేజీ ఆధునీకరణ పనుల నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. తిరుపతి రైల్వే యార్డ్ పరిధిలో ప్రస్తుతం ఉన్న పాత డ్రైనేజీ పైపులు శిథిలావస్థకు చేరాయి. వీటి స్థానంలో అత్యాధునిక బాక్స్ టైప్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని రైల్వే, కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ నిర్మాణం వల్ల భవిష్యత్తులో రైల్వే ట్రాక్‌ల కింద నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థ సాఫీగా సాగుతుంది. ఈ పనుల కోసం ట్రాక్‌ల కింద తవ్వకాలు జరపాల్సి రావడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.
తిరుపతి కేంద్రంగా నడిచే ఈ క్రింది మార్గాల్లోని రైళ్లు నిర్దేశించిన స్టేషన్ల మధ్య రద్దు చేయబడ్డాయి..
పనులు జరుగుతున్న సమయంలో తిరుపతి స్టేషన్‌కు రాకుండా ఇతర మార్గాల్లో నడిచే దూర ప్రయాణ రైళ్లు..
మంగళ ఎక్స్‌ప్రెస్: హజ్రత్ నిజాముద్దీన్ – ఎర్నాకులం.
రాజధాని ఎక్స్‌ప్రెస్: హజ్రత్ నిజాముద్దీన్ – తిరువనంతపురం.
హిమగిరి ఎక్స్‌ప్రెస్: తిరునెల్వేలి – శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా.
ఇతర రైళ్లు: నాగర్‌కోయిల్ – షాలిమార్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు – హతియా ఎక్స్‌ప్రెస్.
ఆలస్యంగా నడిచేవి: తిరుపతి – మైసూరు ఎక్స్‌ప్రెస్, తిరుపతి – కాచిగూడ రైళ్లు నిర్ణీత సమయం కంటే కొంత ఆలస్యంగా నడుస్తాయి.
అదేవిధంగా దారి మళ్లింపు కారణంగా కొన్ని రైళ్లు చిత్తూరు, చంద్రగిరి, తిరుపతి, తిరుచానూరు స్టేషన్లలో ఆగకుండా వెళ్తాయని అధికారులు స్పష్టం చేశారు.
డ్రైనేజీ ఆధునీకరణ వల్ల ప్రయాణికులకు తాత్కాలికంగా ఇబ్బంది కలిగినప్పటికీ, భవిష్యత్తులో రైల్వే స్టేషన్ పరిసరాల్లో మురుగునీటి సమస్య తలెత్తకుండా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. భక్తులు, స్థానిక ప్రయాణికులు ఈ మార్పులను గమనించి సహకరించాలని కోరారు.