
తిరుపతి జిల్లాలో పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌ను పోలీసులకు ఎట్టకేలకు పట్టుకున్నారు. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన విశ్వనాధ్.. అజీజ్‌గా ఆధార్‌లో పేరు మార్చుకుని నేరాలకు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు.. అతనికి పలు కేసులతో సంబంధం ఉన్నట్టు నిర్ధారించారు. 2018లో కేరళ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిన అజీజ్. అప్పటి నుంచి కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 21 నేరాలకు పాల్పడినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వం ఇతనిపై రూ. 2 లక్షల రివార్డు కూడా ప్రకటించినట్టు గుర్తించారు.
ఒంటరి మహిళలు లక్ష్యంగా పలు నేరాలకు పాల్పడిన అజీజ్ నగలు, డబ్బు కోసం దారుణాలకు పాల్పడినట్లు తేల్చారు. హోటళ్లలో పని చేస్తూ స్థానిక మహిళలతో పరిచయాలు పెంచుకోవడం నేరాలకు పాల్పడడం పనిగా మార్చుకున్నట్టు గుర్తించారు. తిరుచానూరులో జరిగిన రెండు హత్యలు, పిచ్చాటూరులో మరొ హత్యకు అజీజ్ పాల్పడినట్లు గుర్తించారు. 2024 నుంచి జిల్లాలో నమోదవుతున్న ఈ కేసులను ఛేదించేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయగా. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి, అజీజ్‌తో పాటు అతని అనుచరుడు ప్రశాంత్, నేరాలకు సహకరించిన వెదురుకుప్పం మండలానికి చెందిన రాజమ్మ అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి రూ. 21.5 లక్షల విలువైన 127.5 గ్రాములు బంగారం, 48 గ్రాములు వెండి, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.