తిరుమల కల్తీ నెయ్యి కేసు: 2021 నుంచి కొండపై ఏం జరిగింది..? సీబీఐ-సిట్ రిపోర్ట్ ఏం తేల్చింది..

2021 నుంచి 2024 మధ్య జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై మాత్రమే సీబీఐ-సిట్ ఎందుకని ఎంక్వైరీ చేసింది? ఆ పిరియడ్‌ను మాత్రమే ఎందుకు పరిగణనలోకి తీసుకుంది? 2019కు ముందు కాలాన్ని ఎందుకు లెక్కలోకి తీసుకోలేదు? ఎందుకంటే.. 2020 ఫిబ్రవరి 29న తీర్మానం నంబర్ 371 ద్వారా టీటీడీ పాలక మండలి అధికారికంగా కొన్ని మార్పులు చేసింది.

తిరుమల కల్తీ నెయ్యి కేసు: 2021 నుంచి కొండపై ఏం జరిగింది..? సీబీఐ-సిట్ రిపోర్ట్ ఏం తేల్చింది..
Tirumala Tirupati Ghee Adulteration Case

Updated on: Jan 29, 2026 | 9:49 PM

‘శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు’ అని అనడం కూడా తప్పేనేమో. నెయ్యిలో అదో ఇదో కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. అసలు అది నెయ్యే కాదు అన్నప్పుడు ‘కల్తీ నెయ్యి’ అని అనడమూ తప్పే. సీబీఐ-సిట్ ఫైనల్ రిపోర్ట్‌.. ఈ నెయ్యికి ఓ పేరు పెట్టింది. ‘సింథటిక్ ఘీ.. జీరో పర్సెంట్ మిల్క్ ఫ్యాట్’ అని. అంటే.. చుక్క పాలు గానీ, గ్రాము వెన్న గానీ లేకుండా తయారు చేసిన ఓ కెమికల్ నెయ్యి అది. చాలామంది నెయ్యిని టెస్ట్ చేయడానికి ఒక చుక్క చేతి మీద వేసుకుని, రుద్ది, వాసన చూసి, అసలుదో కాదో చెప్పేస్తారు. కాని, తిరుమలకు వెళ్లిన ఆ కల్తీ నెయ్యిని రెండు వేళ్లతో రుద్ది చెప్పలేరు. ఎందుకంటే.. అందులో కలిపింది.. బీటా కెరోటిన్. అచ్చంగా నెయ్యి వాసన, నెయ్యి రంగును ఇచ్చే కెమికల్ అది. పైగా ‘ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్’ వాడారు. ఇది కలిపితే.. క్వాలిటీ టెస్టుల్లో సైతం అది స్వచ్ఛమైన నెయ్యే అనే రిపోర్ట్ వస్తుంది. దీనికి తోడు ‘మోనో గ్లిజరైడ్స్’ వంటి రసాయనాలను కలిపారు. ఇది RM వాల్యూని తారుమారు చేస్తుంది. అంటే.. కల్తీ నెయ్యిని సైతం అసలైన నెయ్యిగా చూపిస్తుంది. ఈ వివరాలన్నీ సీబీఐ-సిట్ రిపోర్టులో ఉన్నవే. 2024.. సెప్టెంబర్ 18.. పార్టీ మీటింగ్‌లో వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ.. ‘కడాన పవిత్రమైన తిరుమల లడ్డూను కూడా అపవిత్రం చేశారు’...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి