Janasena: జనసేన పార్టీ కార్యాలయంపై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం.. వైసీపీ శ్రేణులే అంటూ ఆరోపణలు

టెక్కలి జనసేన పార్టీ కార్యాలయంపై దాడికి స౦బ౦ది౦చి ఆమదాలవలస నియోజకవర్గ జనసేన ఇన్ చార్జ్ రామ్మోహన్ శ్రీకాకుళంలో ASP శ్రీనివాస్ ని కలసి ఫిర్యాదు చేసారు.

Janasena: జనసేన పార్టీ కార్యాలయంపై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం.. వైసీపీ శ్రేణులే అంటూ ఆరోపణలు
Tekkali Janasena Office

Updated on: Oct 22, 2022 | 7:23 AM

శ్రీకాకుళం జిల్లా టెక్కలి జనసేన పార్టీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేసారు. కార్యాలయంలోని ఫర్నిచర్ ని ధ్వంసం చేసారు.అయితే దాడి చేసింది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచరులే అని అంటున్నారు స్థానిక జనసేన పార్టీ నాయకులు. మూడు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ పై MLC దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేయగా….దువ్వాడ పై తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు టెక్కలి జనసేన నాయకులు.

టెక్కలి జనసేన పార్టీ కార్యాలయంపై దాడికి స౦బ౦ది౦చి ఆమదాలవలస నియోజకవర్గ జనసేన ఇన్ చార్జ్ రామ్మోహన్ శ్రీకాకుళంలో ASP శ్రీనివాస్ ని కలసి ఫిర్యాదు చేసారు. YCPకి చెందిన వారు తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసారని….వారిని అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు జనసేన పార్టీ కార్యాలయంపై దాడికి స౦బ౦చి టెక్కలి నియోజకవర్గ BJP నాయకులు స్ప౦ది౦చారు. జనసేన పార్టీ కార్యాలయంకి వెల్లి జనసైనికులకు స౦ఘీభావ౦ తెలిపారు. YCP కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

 

ఇవి కూడా చదవండి

Reporter:-S.Srinivas

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.