Andhra Pradesh: విషాదం నింపిన వేడుకలు.. నిమజ్జనానికి వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయారు..

|

Sep 12, 2022 | 11:36 AM

ఆ యువకులు వినాయక చవితి (Vinayaka Chavithi) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇష్ట దైవానికి నవరాత్రులు పూజలు చేసి ఘనంగా వీడ్కోలు పలికాలనుకున్నారు. ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేశారు. వచ్చే ఏడు ఇంతకంటే...

Andhra Pradesh: విషాదం నింపిన వేడుకలు.. నిమజ్జనానికి వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయారు..
Uppada Sea
Follow us on

ఆ యువకులు వినాయక చవితి (Vinayaka Chavithi) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇష్ట దైవానికి నవరాత్రులు పూజలు చేసి ఘనంగా వీడ్కోలు పలికాలనుకున్నారు. ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేశారు. వచ్చే ఏడు ఇంతకంటే ఘనంగా పండుగ జరుపుకోవాలనుకుంటూ ఇంటికి బయల్దేరారు. మరోసారి సముద్రం వైపు తిరిగి చూశారు. వారు నిమజ్జనం చేసిన విగ్రహం బయటకు కొట్టుకురావడాన్ని గమనించారు. వెంటనే సముద్రం లోపలికి వెళ్లి విగ్రహాన్ని వెనక్కు నెడుతున్నారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన అల వారిని విగ్రహంతో పాటు లోపలికి లాక్కెళ్లింది. వీరిలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. కాకినాడ (Kakinada) జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామానికి చెందిన యువకులు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లారు. ఊరేగింపుగా ఉప్పాడ సమీపంలోని హార్బర్‌ వద్ద నిమజ్జనం చేశారు. అయితే అలల తాకిడికి విగ్రహం వెనక్కి కొట్టుకు వచ్చింది. ఇది గమనించిన సతీశ్, విజయ వర్ధన్, వెంకటరెడ్డిలతో పాటు మరో ముగ్గురు యువకులు సముద్రంలోనికి వెళ్లారు. విగ్రహాన్ని లోపలకు నెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అలల ఉద్ధృతి ఎక్కువైంది. కెరటాలకు తట్టుకోలేక విగ్రహంతో పాటు లోపలికి కొట్టుకుపోయారు.

అక్కడే ఉన్న వారు భయంతో కేకలు వేశారు. వారి అరుపులు విని సమీపంలో ఉన్న మత్స్యకారులు అలర్ట్ అయ్యాయి. సముద్రంలో కొట్టుకుపోయిన వారి ఆచూకీ కోసం బోటుపై వెళ్లారు. ఆరుగురిలో నలుగురు యువకులను రక్షించి ఒడ్డుకు తీసుకు వచ్చారు. వీరిలో వెంకట రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో పిఠాపురం గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. సతీశ్, విజయ వర్ధన్ ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బోట్లు, పడవల సహాయంతో సముద్రంలో చక్కర్లు కొడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..