ఆమె కోటి ఆశలు కల్లయ్యాయి.. తల్లిదండ్రులు.. వారికి ఇద్దరి పిల్లలు. బాగా చదువుకొని జీవితంలో స్థిరపడి కుటుంబానికి అండగా ఉండాలని అనుకుంది. ఏ కష్టం వచ్చినా కుటుంబానికి ధైర్యం చెప్పేది. కానీ ఇటువంటి పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదు. అప్పుల బాధ ఇద్దరు తల్లిదండ్రులను మింగేసింది. పోనీ ఆమె అయినా.. కోరుకుంటున్నాము అంతా అనుకున్నారు. కానీ విధి కనికరించలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. విశాఖ జిల్లా పెందుర్తి గొరపల్లిలో కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరడం.. అందరినీ కలచివేసింది.
శ్రావణ శుక్రవారం రోజు పెందుర్తి మండలం గోరపల్లిలో అప్పుల బాధ తల లేక కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. సత్యనారాయణ, సూర్య కుమారి దంపతులు కుటుంబంతో కలిసి గొరపల్లిలో నివాసం ఉంటున్నారు. వాళ్లకు సంతోష్ అనే కొడుకు, డిగ్రీ చదువుతున్న కూతురు నీలిమ (24) ఉన్నారు. గురువారం రాత్రి కూతురు నీలిమతో కలిసి పాయిజన్ తాగేశారు పేరేంట్స్. రాత్రి ఒంటిగంటకు ఇంటికి వచ్చే చుసిన ఆ కొడుకు.. అపస్మారక స్థితిలో ఉన్న కుటుంబ సభ్యులను గుర్తించాడు. స్థానికుల సాయంతో వాళ్లను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురుని కేజీహెచ్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కల్లూరి సత్యనారాయణ (55) తొలుత మరణించాడు. తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు బంధువులు, సన్నిహితులు. ఆ తర్వాత కొద్దిసేపటికి భార్య సూర్యకుమారి (47) ప్రాణాలు కోల్పోయింది. దీంతో మరింత విషాదంలోకి వెళ్లిపోయారు.
సూర్య కుమారి సత్యనారాయణ దంపతుల కూతురు నీలిమ కూడా అదే సమయంలో ఆసుపత్రి పాలైంది. పేరెంట్స్ ఇద్దరు ప్రణాలు కోల్పోయినా .. నీలిమ బతికి బయటపడుతుందని అనుకున్నారు. సన్నిహితులు బంధువులు స్నేహితులు దేవుని ప్రార్థించారు. కానీ అవేవీ నీలిమను కాపాడలేకపోయాయి. ఒకవైపు రసాయనం తాగి అస్వసత గురైన నీలిమా.. పేరెంట్స్ లేక ఇక తాను ఈ లోకంలో ఉండి ఎందుకని అనుకుందో ఏమోగానీ ఆమె ప్రాణాలు నిలవలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది నీలిమ. మృతదేహానికి పోస్టుమార్టం తర్వాత కన్నీటితో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ తీవ్రంగా కలచివేసింది విషాదాన్ని నింపింది.
సత్యనారాయణ అంతలా మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలకు కోల్పోవడం మరొకరు ఆసుపత్రి పాలవడంతో సన్నిహితుల బంధువులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. వాస్తవానికి సత్యనారాయణ కు సున్నిత మనస్కుడు. కిరాణా దుకాణం నిర్వహించే సత్యనారాయణ కోవిడ్ సమయంలో షాపు నిర్వహణ లేక అప్పుల పాలయ్యాడు. ఆ తర్వాత కుదుటపడిన అప్పులు తీర్చలేకపోయాడు. మరోవైపు సత్యనారాయణ కొడుకు సంతోష్ కూడా లోన్లు కూడా తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. క్రెడిట్ కార్డులు కూడా వినియోగించి సకాలంలో డబ్బులు చెల్లించలేకపోయాడు. కొడుకు అంతలా అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా ఆ కుటుంబానికి అర్థం కాలేదు. పోలీసులు ఆ కోణంలో వెరిఫై చేస్తున్నారు. అప్పులే.. తలకు మించిన భారమై.. అప్పులోళ్ళ బాధ తల లేక.. అప్పులు తీర్చలేక.. పరువు పోతుందన్న మనస్తాపంతో.. ఇలా ఈ కుటుంబ పురుగుల మందు తాగినట్టు పోలీసులు గుర్తించారు.
మరిన్ని ఆంధ్రప్రద్రేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..