Tirumala: తిరుమలలో కలకలం రేపిన హెలికాప్టర్లు.. కొండ మీదుగా వెళ్లిన మూడు..

|

Apr 25, 2023 | 5:17 PM

తిరుమల కొండపై హెలికాప్టర్ల సంచారం కలకలం రేపింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు హెలికాప్టర్లు కొండ మీదుగా వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం ఆలయానికి సమీప ప్రాంతం మీదుగా హెలికాప్టర్లు వెళ్లినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే తిరుమల..

Tirumala: తిరుమలలో కలకలం రేపిన హెలికాప్టర్లు.. కొండ మీదుగా వెళ్లిన మూడు..
TTD NEWS
Follow us on

తిరుమల కొండపై హెలికాప్టర్ల సంచారం కలకలం రేపింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు హెలికాప్టర్లు కొండ మీదుగా వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం ఆలయానికి సమీప ప్రాంతం మీదుగా హెలికాప్టర్లు వెళ్లినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే తిరుమల నో ఫ్లైయింగ్ జోన్‌ అనే విషయం తెలిసిందే. నో ఫ్లైయింగ్ జోన్‌లో ఎలాంటివి ఎగరకూడదనే నిబంధన ఉంది. శ్రీవారి ఆలయానికి సమీపంగా వెళ్లడం గమనార్హం.

ఇదిలా ఉంటే తిరుమల కొండపై నుంచి వెళ్లిన హెలికాప్టర్లు ఏయిర్‌ ఫోర్స్‌ విభాగానికి చెందినవిగా అధికారులు గుర్తించారు. కడప నుంచి చెన్నైకి వెళ్లే సమయంలో హెలికాప్టర్లు తిరుమల మీదుగా ప్రయాణించినట్లు తెలుస్తోంది. అయితే నో ఫ్లైయింగ్ జోన్‌లో హెలికాప్టర్‌కు ఎలా అనుమతి ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అత్యంత పటిష్ట భద్రత ఉండే తిరుమల కొండపై హెలికాప్టర్లు ఎగరడంతో టీటీడీ అధికారులు అలర్ట్‌ అయ్యారు. అసలు హెలికాప్టర్‌లు కొండపై ఎగరడానికి కారణం ఏంటన్న దానిపై విచారణ చేపట్టారు. ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీతో ఈ విషయమై చర్చించినట్లు సమాచారం. కడప నుంచి చెన్నై వెళ్తున్న ఏయిర్ ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు.

ఇదిలా ఉంటే గతంలో తిరుమలలో డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేపిన విషయం తెలిసిందే. తిరుమలలో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా చేపట్టిన సర్వేకోసం ఓ సంస్థ డ్రోన్ లను ఉపయోగించిన వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..