
ప్రకాశం బ్యారేజీ దగ్గర మూడో బోటును అధికారులు ఎట్టకేలకు తొలగించారు. ఇప్పటికే రెండు బోట్లను తొలగించిన అధికారులు తాజాగా మూడో పడవను బయటికి తీశారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి అడ్డుపడిన బోటును బయటకు తీశారు. చైన్ పుల్లర్లతో ఎత్తి బ్యారేజీ ఎగువకు తరలించారు. 40 టన్నుల బరువున్న ఈ పడవ బ్యారేజీ 69వ గేట్ వద్ద ఢీకొని అడ్డుగా మారింది. దీన్ని ప్రస్తుతం ఇంజినీర్లు పున్నమి ఘాట్ వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బెకెం ఇన్‌ఫ్రా సంస్థ ఇంజినీర్లు, అధికారులు ఇప్పటివరకు ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడిన 3 భారీ పడవలను వెలికితీశారు. ఆపరేషన్ H పేరుతో చేపట్టిన ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యిందని అధికారులు వెల్లడించారు.
ఇక ఈ బోట్లను తీయడానికి అధికారులు 15 రోజులు శ్రమించాల్సి వచ్చింది. ఈనెల 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకు పోగా, మరో 3 భారీ బోట్లు, ఒక మోస్తరు పడవ గేట్ల వద్ద చిక్కుకున్నాయి. ఇవి బ్యారేజీ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. దీంతో భారీ పడవలను తొలగించేందుకు పలు ప్లాన్ అమలు చేసిన అధికారులు రెండు పడవలను బయటకు తీశారు. తాజాగా మూడో బోటును వెలికితీసి సక్సెస్ అయింది. అయితే నాలుగో పడవ నీటిలో చిక్కుకుందన్న అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..