ఆ హాట్ సీటులో రెబల్ ఎఫెక్ట్.. ఏ పార్టీపై పడుతుందో అన్న ఉత్కంఠ..

ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల లెక్కలు వేస్తున్నారు. ఎవరికి వారే తాము గెలుస్తామంటే.. తామే గెలుస్తామంటూ ధీమాగా ఉన్నారు. అయితే ఉత్తరాంధ్రలోనే ఆ కీలక నియోజకవర్గంలో మాత్రం ప్రధాన పార్టీలతో పాటు నేను కూడా గెలవబోతున్నానని ఇండిపెండెంట్ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఇండిపెండెంట్ అభ్యర్ధి ఎఫెక్ట్ ఎవరి మీద పడబోతుందో అని ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతుంది.

ఆ హాట్ సీటులో రెబల్ ఎఫెక్ట్.. ఏ పార్టీపై పడుతుందో అన్న ఉత్కంఠ..
Ycp and Tdp
Follow us

| Edited By: Srikar T

Updated on: May 25, 2024 | 4:25 PM

ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల లెక్కలు వేస్తున్నారు. ఎవరికి వారే తాము గెలుస్తామంటే.. తామే గెలుస్తామంటూ ధీమాగా ఉన్నారు. అయితే ఉత్తరాంధ్రలోనే ఆ కీలక నియోజకవర్గంలో మాత్రం ప్రధాన పార్టీలతో పాటు నేను కూడా గెలవబోతున్నానని ఇండిపెండెంట్ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఇండిపెండెంట్ అభ్యర్ధి ఎఫెక్ట్ ఎవరి మీద పడబోతుందో అని ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతుంది. స్వతంత్ర అభ్యర్థి వల్ల మాకు నష్టం లేదంటే మాకు నష్టం లేదంటూ ప్రధాన పార్టీలు రెండు ఎవరి లెక్కలు వాళ్లు వేస్తున్నారు. ఇంతకీ అసలు టిడిపి రెబల్ అభ్యర్ధి పోటీ ఎలా ఉండబోతుంది? ఆమె లెక్క పక్కా అవుతుందా? లేక ఆమె పోటీ నామ మాత్రమేనా? ఆమె పోటీ ఎవరికి చేటు? అసలు లెక్కలు ఏంటి? అన్న చర్చ జోరుగా సాగుతుంది.

విజయనగరం జిల్లాలో కీలకమైన విజయనగరం నియోజకవర్గాన్ని దక్కించుకునేందుకు రాజకీయపార్టీలు ఎవరికి వారే సర్వశక్తులు ఒడ్డుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి కూడా ఇక్కడ ఎన్నికలు ఉత్కంఠగా సాగాయి. అయితే ఎప్పుడూ టిడిపి, వైసిపి అభ్యర్థులు మాత్రమే ఎన్నికల పోటీలో ఉంటే ఈ సారి మాత్రం టిడిపిలో టిక్కెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. దీంతో ఈ ఎన్నికలు త్రిముఖంగా మారాయి. దీంతో ప్రధానంగా టిడిపి రెబల్ అభ్యర్ధి మీసాల గీతకు ఎన్ని ఓట్లు పడుతాయి? ఆమెకు పడే ఓట్లు టిడిపి వా? వైసిపి వా? ఆమెకు పడే ఓట్లు వల్ల ఎవరికి నష్టం? ఇవే లెక్కలు సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఇక్కడ గజపతిరాజుల వారసులైన పూసపాటి అశోక్ గజపతి రాజు ఈ నియోజకవర్గానికి టిడిపి తరపున సుధీర్ఘంగా నాయకత్వం వహిస్తూ వచ్చారు.. అయితే గత 2019లో అశోక్ గజపతి రాజు ఎంపిగా పోటీచేయడంతో ఆయన కుమార్తె అదితి గజపతి రాజుఎమ్మెల్యే టిక్కెట్ దక్కించుకున్నారు. అలా గత 2019 ఎన్నికలు, ఆ తరువాత ప్రస్తుత 2024 ఎన్నికల్లో ఈయన కుమార్తె అదితి గజపతి రాజు టిక్కెట్ దక్కించుకున్నారు. అయితే 2019లో అదితి గజపతి రాజు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మొదటి సారి ఓటమి పాలవ్వగా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎన్నికల్లో గట్టిగానే కష్టపడ్డారు. అయితే ఈ నియోజకవర్గ టిడిపి నుండి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా టిడిపి టిక్కెట్‎పై ఆశలు పెట్టుకున్నారు.

2014 ఎన్నికల్లో టిడిపి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన గీత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో టిడిపి టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈమె కూడా ఇక్కడ ప్రత్యేక టిడిపి కార్యాలయం పెట్టుకొని టిడిపి యాక్టివిటీస్ చేస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కని గీత ఈ ఎన్నికల్లో అయినా సరే విజయనగరం లేదా మరో చోట నుండి అయినా సరే టిక్కెట్ ఇవ్వాలని అడిగారు గీత. అయితే ప్రస్తుత ఎన్నికల్లో కూడా టిక్కెట్ దక్కకపోవడంతో మనస్తాపం చెందిన గీత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. మీసాల గీతను బుజ్జగించేందుకు పలువురు పార్టిపెద్దలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో టిడిపి నుండి ఒకరు పోటీ చేస్తే, టిడిపి రెబల్ అభ్యర్థిగా మరొకరు బరిలోకి దిగారు. ఇక అధికార వైసిపి నుండి కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. కోలగట్ల స్థానికంగా బలమైన నేత.. రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన కోలగట్ల ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మాస్ ఫాలోయింగ్‎తో ముందుకు వెళ్లే కోలగట్ల ఇక్కడ రాజాస్ కుటుంబంతో దశాబ్దాలుగా పోటీ పడుతూనే ఉన్నారు. అయితే ఎమ్మేల్యేగా పనిచేసిన గత ఐదేళ్లలో నియోజకవర్గంలో కొంత మేర అభివృధ్ధి కార్యక్రమాలు, సుందరీకరణ, త్రాగునీటి సమస్య వంటి వాటి పై దృష్టి పెట్టారు. ఇలా ముగ్గురు నేతలు తమ తమ వ్యక్తిగత, పార్టీ ఎజెండాలతో ఎన్నికల్లో బరిలో ఉన్నారు. ఎన్నికలు కూడా సజావుగా సాగాయి. పోలింగ్ శాతం కూడా గతం కన్నా పెరిగింది. దీంతో పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలం అని రెండు ప్రధాన పార్టీలు అంచనా వేస్తుంటే సైలెంట్ ఓటింగ్ అంతా తనదే అని అంటున్నారు స్వతంత్ర అభ్యర్థి మీసాల గీత. అయితే గీతకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు పడితే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ టిడిపిపైన పడే అవకాశాలు ఉన్నాయి. లేక నామమాత్రంగా పోటీలో ఉంటే టిడిపికి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదే లెక్కలపై ఆశలు పెట్టుకున్నారు వైసిపి అభ్యర్థి కోలగట్ల. అయితే టిడిపి మాత్రం గీత ప్రభావం తమపై ఏ మాత్రం పడలేదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో గీత ఏ మాత్రం ప్రభావం చూపనుంది? ఏ అభ్యర్థి గెలబోతున్నారన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…