అనంతపురం జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరు మండలం వడ్డుపల్లి కాలువ గట్టు సమీపంలో ఓ యువతి(22)ని అత్యంత దారుణంగా హతమార్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె తలపై బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేసిన ఘటన శనివారం(సెప్టెంబర్ 7) వెలుగులోకి వచ్చింది. అటు వైపు వెళ్లిన గొర్రెల కాపరులు యువతి మృతదేహాన్ని చూసి ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గురైన యువతి ఎవరు, ఎందుకు హత్య చేశారు..? నిందితులు ఎవరనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా , ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..