వైఎస్ వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పును ఇచ్చింది. ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో సీబీఐ పిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయమై సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. బెయిల్ రద్దు అంశం తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని తీర్పునిచ్చింది. మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే ఈ నెల 5న గంగిరెడ్డి బెయిల్ రద్దుపై వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. గత విచారణ సమయంలో తీర్పును జస్టిస్ ఎమ్‌ఆర్ షా ధర్మాసనం రిజర్వ్ చేసింది. కేసులో మెరిట్స్ ఆధారంగా బెయిల్ రద్దు చేయాలా వద్దా అన్న విషయాన్ని నిర్ణయించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీం ఆదేశించింది. గతంలో బెయిల్ మంజూరు చేసినప్పుడు మెరిట్‌ను పరిగణలోకి తీసుకోలేదు, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీం తెలిపింది. కేసు ట్రయల్‌ను తెలంగాణకు బదిలీ చేసిన నేపథ్యంలో బెయిల్ రద్దు అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టులో తేల్చాలని సుప్రీం ఆదేశించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..