Weather Alert: బీ అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది… ఈ జాగ్రత్తలు పాటించండి.

మొన్నటి వరకు ఎండలతో వేడెక్కిన వాతావరణం ఇప్పుడు ఒక్కసారిగా చల్లబడింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు కమ్ముకున్నాయి...

Weather Alert: బీ అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది... ఈ జాగ్రత్తలు పాటించండి.
Thunderstorms

Updated on: Mar 17, 2023 | 12:26 PM

మొన్నటి వరకు ఎండలతో వేడెక్కిన వాతావరణం ఇప్పుడు ఒక్కసారిగా చల్లబడింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. మధ్యాహ్నమే చీకట్లు అలుముకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాలు కురిశాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షాలు శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. కొన్ని చోట్ల వడగండ్ల వర్షం కురిసింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో పిడుగులు సైతం పడ్డాయి. వేర్వేరు ప్రమాదాల్లో పిడుగు పాటుకు మొత్తం నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఇందులో తె లంగాణ రాష్ట్రంలో గొర్రెలకాపలా కొసం వెళ్లిన ఇద్దరు యువకులతోపాటు ఒక మహిళ మృతి చెందింది. ఏపిలోని పిడుగు రాళ్ల సమీపంలో మరో వ్యక్తి మృతి చెందాడు. మేత కోసం వెళ్లిన గొర్రెలు, మేకలు ఉరుములు..మెరుపు లు పిడుగులు.. వానల ప్రభావంతో ఆరుబయలు పొలాల్లోనే వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి.

పిడుగులతో జాగ్రత్త..

ఉపరితల ఆవర్తనం, అకాల వార్షాల కారణంగా రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరికాలు జారీ చేశారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే వారు, పశువుల కాపరులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గాలి వేగం గంటకు 40కి.మితో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు , పల్నాడు, బాపట్ల, నెల్లూరు , ప్రకాశం , కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నంతో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడనున్నాయని అధికారులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

పిడుగుల నుంచి ఎలా తప్పించుకోవాలి.?

* ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో ఇంట్లో నుంచి బయటకు రాకపోవడమే మంచిది.

* పొలాల్లో పనిచేసే రైతులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. చెట్ల కింద, టవర్ల కింద నిలబడకకూడదు. భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి.

* పిడుగులు పడే సమయంలో సెల్‌ఫోన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించకూడదు.

* ఆశ్రయం పొందడానికి స్థలం లేకపోతే మోకాళ్లపై చేతులు, తల దగ్గరగా ముడుకొని కూర్చోవాలి.

* ఇళ్లలో టీవీలు, ఫ్రిడ్జ్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను స్విచ్ఛాఫ్‌ చేయాలి. పిడుగు పడిన సమయంలో విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే అవకాశం ఉంటుంది. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..