ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష జరగనుంది. రూ.500 రుసుముతో జనవరి 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
మరోవైపు.. తెలంగాణలోనూ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పదో తరగతి బోర్డు పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పరీక్షకు మూడు గంటల సమయం కేటాయిస్తున్నామన్నారు. పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ లేదని వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి