AP Congress: విజయవాడకు ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ.. పీసీసీ మార్పుకేనా..

|

Dec 21, 2021 | 6:27 PM

ఏపీలో కాంగ్రెస్‎ను పటిష్టం చేయాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. అందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ విజయవాడ చేరుకున్నారు..

AP Congress: విజయవాడకు ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ.. పీసీసీ మార్పుకేనా..
Goa Congress Party
Follow us on

ఏపీలో కాంగ్రెస్‎ను పటిష్టం చేయాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. అందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ విజయవాడ చేరుకున్నారు. ఉమెన్ చాంది పర్యటన ఆసక్తిని రేకెత్తిస్తుంది. గతంలో రఘువీరా రెడ్డి ఉన్నప్పుడు జోష్ ఇప్పటి చీఫ్‎గా ఉన్న శైలజానాథ్ సారథ్యంలో కనపడలేదని కొంతమంది వాదిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు కసరత్తులో భాగంగా ఏపీ కాంగ్రెస్ కెప్టెన్ మార్పు తప్పదని అంటున్నారు. ఉమెన్ చాందీ ఈ పర్యటనలో పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు చేసి చర్చలు జరిపి కొత్త కెప్టెన్ ఎంపిక ఉంటుందని సమాచారం. పార్టీ క్యాడర్, ప్రజల్లో భరోసా కల్పిస్తే పార్టీ పట్టాలెక్కుతుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. అందుకే పీసీసీ మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సామాజిక, ఆర్థిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని కొత్త చీఫ్ ఎంపిక ఉంటుందంటున్నారు నేతలు.

పీసీసీ రేసులో మాజీ ఎంపీ హర్షకుమార్, జెడి శీలం, మస్తాన్ వలి, గిడుగు రుద్రరాజు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ మహిళలకు పెద్దపీట వేయాలనుకుంటే పీసీసీ రేసులో సుంకర పద్మశ్రీ పేరు కూడా పరిశీలనలో ఉంది. కొత్తగా ఎవరు ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల వైపు పోరాటాలు చేస్తే గానీ అనుకున్న ఫలితాలు సాధించలేమని అధిష్ఠానం భావిస్తోంది. అందుకే ప్రజా సమస్యలపై పోరాటం చేసేవారిని ఎంపిక చేయాలను చూస్తుంది. ఇలా ప్రభుత్వం పోరాటం చేస్తున్న వారిలో సుంకర పద్మశ్రీ ఉన్నారు. ఆమె రాష్ట్రంలో సమస్యలపై, ప్రభుత్వం అక్రమాలు, ప్రజావ్యతిరేక పాలనపై పోరాడుతున్నారు. ప్రత్యేక హోదా, అమరావతి ఉద్యమం, విశాఖ స్టీల్ ప్రైయవేటీకరణ, పోలవరం వంటి అంశాలపై గట్టిగా గళం వినిపిస్తున్నారు. ఆమె కూడా పీసీసీపై ఆశలు పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధిష్ఠానం మహిళకు అవకాశం కల్పిస్తే మిగతా సీనియర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read Also.. Corona: ఒమిక్రాన్ కి మందు సిద్ధమన్న నెల్లూరు ఆనందయ్య.. ఆయూష్‌ అనుమతులొచ్చాక ఆన్‌లైన్‌లో సరఫరా చేస్తామని వెల్లడి..