AP High Court: ఎస్‌ఈసీ ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు.. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడకూడదని కీలక ఆదేశం

|

Feb 07, 2021 | 12:36 PM

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే పెద్దిరెడ్డి హౌస్‌ అరెస్టు ఆదేశాలు చెల్లవన్న హైకోర్టు.. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడకూడదని ఆదేశిచింది..

AP High Court: ఎస్‌ఈసీ ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు.. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడకూడదని కీలక ఆదేశం
The AP High Court
Follow us on

AP High Court: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే పెద్దిరెడ్డి హౌస్‌ అరెస్టు ఆదేశాలు చెల్లవన్న హైకోర్టు.. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడకూడదని ఆదేశిచింది. ఎస్ఈసీ ఆదేశాలను కొట్టివేంది హైకోర్టు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై ఆదివారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. దీంతో ఏపీ హైకోర్టులో వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. పెద్దిరెడ్డి తరపున న్యాయవాది మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

అయితే ఎస్‌ఈసీ దేశాలను కొట్టివేసిన హైకోర్టు. పెద్దిరెడ్డి ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవద్దని సూచించింది. ఎన్నికలు జరిగే వరకు మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది. గృహ నిర్బంధం చేయరాదని ఎన్నికల కమిషన్‌కు ఆదేశించింది హైకోర్టు.

చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలను ఆపాలని శనివారం ఆదేశాలు జారీ చేశారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. దీనిపై తీవ్రంగా స్పందించిన పెద్దిరెడ్డి.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు స్పందించిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా చూడాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఆదేశించారు. ఈ నెల 21వ తేదీ వరకు ఆయనను హౌస్‌ అరెస్ట్‌ చేయాలన్నారు. మీడియాతో కూడా మాట్లాడనివ్వద్దని స్పష్టం చేశారు. అంతేకాకుండా పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం కోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ రోజు విచారించిన కోర్టు.. కీలక ఆదేశాలు జారీచేసింది.

Also Read:

CM Jagan, Ganta Srinivasa Rao: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన గంటా శ్రీనివాసరావు

Rayalaseema Name: ‘రాయలసీమ’ అనే పేరు ఎలా వచ్చింది.. దీనిని ఎవరు ప్రతిపాదించారు..? ఈ పేరుకు ప్రత్యేకత ఏమిటి.?