నెల్లూరులో పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్.. టెన్షన్..

నెల్లూరు ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. శ్రీధర్ రెడ్డి కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకున్నారు. సర్వే చేస్తున్నారన్న అనుమానంతో గురువారం కొందరి యువకులపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి పలువుర్ని అరెస్ట్ చేశారు. దీంతో తమ కార్యకర్తల్ని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కోటెంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో […]

నెల్లూరులో పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్.. టెన్షన్..

Edited By:

Updated on: Mar 09, 2019 | 12:50 PM

నెల్లూరు ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. శ్రీధర్ రెడ్డి కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకున్నారు.

సర్వే చేస్తున్నారన్న అనుమానంతో గురువారం కొందరి యువకులపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి పలువుర్ని అరెస్ట్ చేశారు. దీంతో తమ కార్యకర్తల్ని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కోటెంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో బైఠాయించారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు. తమ విధులకు ఆటంకం కలిగించినందుకు శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు నెల్లూరు వైసీపీ ఆఫీసుకు వెళ్లగా.. పార్టీ కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకున్నారు.