చౌల్లూరు నివురుగప్పిన నిప్పులా మారింది. ఇవాళ వైసీపీ నేత రామకృష్ణారెడ్డి అంత్యక్రియల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చౌల్లూరుకు భారీగా చేరుకుంటోంది వైసీపీ క్యాడర్. అంత్యక్రియల్లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్సీ పీఏ గోపికృష్ణ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. హిందూపురం వైసీపీ నేత రామకృష్ణారెడ్డి మర్డర్ కేసు మలుపులు తిరుగుతోంది. హత్య కేసులో ఎమ్మెల్సీ ఇక్బాల్‌పై అనుమాలు వచ్చినా.. ఆఖరికి ఆయన పీఏపై మాత్రమే కేసు నమోదయింది. ఇక శాంతి భద్రతల పేరుతో పోలీసులపై వేటు పడింది. రూరల్ సీఐ, ఎస్సైలను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఈ హత్యతో హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతుడి బంధువులను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను కూడా అడ్డుకున్నారు రామకృష్ణా రెడ్డి అభిమానులు.
పోలీసుల కథనం ప్రకారం.. రామకృష్ణారెడ్డి స్వగ్రామం కర్ణాటక సరిహద్దుల్లోని చౌళూరు సమీపంలో దాబా నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి దాబాను మూసివేసి, కారులో ఇంటికి వచ్చారు. కారులో నుంచి దిగుతుండగా అప్పటికే మాటువేసిన దుండగులు ఆయనపై కారం పొడి చల్లి వేట కొడవళ్లతో దాడిచేశారు. ఏకంగా 18 చోట్ల దారుణంగా నరికారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణారెడ్డిని చికిత్స కోసం స్థానికులు హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
రామకృష్ణారెడ్డి.. మరెవరో కాదు.. ఈప్రాంతంలోనే పేరున్న రాజకీయ కుటుంబం. వైయస్ఆర్సీపీ స్థాపించిన తొలినాళ్లలో హిందూపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ గా పని చేశారు. అంతే కాదు ఎన్టీఆర్ కన్నా ముందు.. హిందూపూర్ ఎమ్మెల్యేగా పని చేశారు రామకృష్ణారెడ్డి తాతయ్య. ఇక రామకృష్ణారెడ్డి మద్దెలచెరువు సూరికి స్వయానా కజిన్ అవుతారు. అలాంటి రాజకీయ ప్రాముఖ్యమున్న నేతపై దాడికి తెగబడేంత గుండె ధైర్యం ఎవరికి ఉన్నట్టు?
మొన్నటి వరకూ ప్రశాంతంగానే ఉన్న హిందూపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ ఎంట్రీ ఇచ్చాకే ఇలాంటి గొడవలు మొదలయ్యాయని అంటారు స్థానికులు. ఇక్బాల్ Mlc, కన్నా ముందు హిందూపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఇక్బాల్ రిటైర్డ్ ఐపీఎస్, మాజీ రాయలసీమ ఐ జి కూడా. అయితే ఇక్బాల్ వచ్చినప్పటి నుంచి హిందూపూర్ సెగ్మెంట్లో గ్రూపు తగాదాలు మొదలయ్యాయని అంటారు ఇక్కడి వారు. ఇక్బాల్ పీఏ, గోపీకృష్ణకూ రామకృష్ణారెడ్డికి గత కొంత కాలంగా గొడవలున్నట్టు చెబుతున్నారు. ఈ గొడవలే ఆధిపత్య పోరుకు దారి తీసినట్టు అంచనా. ఈ కారణాలే.. రామకృష్ణారెడ్డి హత్యకు తెరలేచినట్టు అనుమానిస్తున్నారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం