Annavaram Temple: సత్యదేవుని ఉత్సవాల్లో అపచారం.. మందు, చిందులతో అశ్లీలం, చర్యలు తప్పవంటున్న ఆలయ ఈవో..

|

May 14, 2022 | 4:37 PM

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అపచారం జరిగింది. గ్రామోత్సవాల్లో జరిగిన అపచారంపై ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు స్పందించారు.

Annavaram Temple: సత్యదేవుని ఉత్సవాల్లో అపచారం.. మందు, చిందులతో అశ్లీలం, చర్యలు తప్పవంటున్న ఆలయ ఈవో..
Annavaram Apacharam
Follow us on

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అపచారం జరిగింది. సత్యదేవుని వార్షిక కల్యాణ మహోత్సవాల్లో భాగంగా 3 వ రోజు కొండ దిగువ జరిగిన ఊరేగింపు ఉత్సవాల్లో ఆధ్యాత్మిక పాటలకు బదులు సినిమా పాటలతో అసభ్యంగా నృత్య ప్రదర్శనలు చేశారు. రావణ బ్రహ్మ వాహనం పై స్వామి అమ్మవార్లను ఉరేగిస్తూ నిర్వహించిన గ్రామోత్సవంలో ఆధ్యాత్మికం విడనాడి అశ్లీలాన్ని తలపించారు. ఊర్రూతలూగించే హుషారైన పాటలకు ఆలయ అధికారులు, సిబ్బంది బాధ్యతలను మర్చిపోయి మద్యం మత్తులో స్టెప్పులు వేశారు. ఉత్సవాలను తిలకించడానికి వచ్చిన భక్తులు ఇది చూసి ముక్కున వేలు వేసుకున్నారంటా !. ఇది దేవుడి ఉత్సవమా జాతరల్లో జరిగే రికార్డింగ్ డాన్స్‌లా అంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వామివారి ఊరేగింపులో వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మికతను కలిగింప చేసే కార్యక్రమాలు నిర్వహించడం ముఖ్యం… కానీ, అన్నవరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రంలో వీటిని అధికారులు తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారు. సత్యదేవుని రావణ బ్రహ్మ ఊరేగింపు కార్యక్రమంలో సత్యదేవునికి అపచారం జరిగేలా అసాంఘిక నృత్యలు చోటు చేసుకోవటం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సినిమా పాటలు, డాన్స్‌లు వేయడంతో ఇది దేవుడు ఉత్సవమా లేదా మరేదైననా..? అన్నభావన పలువురులో కలిగేలా అధికారులు ఇలాంటి దారుణాలకు స్వీకారం చుట్టారని మండిపడ్డారు.. గ్రామోత్సవంలో పలువురు మందుబాబులు సైతం హల్‌చల్‌ చేశారు. అన్నవరం దేవస్థానం సూపరింటెండెంట్ కృష్ణ ప్రసాద్, డి.ఇ. పర్వత గుర్రాజులు మద్యం మత్తులో డ్యాన్సులు వేయడం విస్మయం కలిగించింది.

కల్యాణానికి కేటాయించిన 70 లక్షల రూపాయల బడ్జెట్‌, ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకేనా..? దేవాదాయశాఖ అనుమతులు ఇచ్చింది మీకు అంటూ..పలువురు ప్రశ్నిస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అన్నవరం సత్యదేవుని వార్షికకల్యాణ మహోత్సవాల్లో అపచారం జరగడంపై భక్తులు మండిపడుతున్నారు. ముందు మందుబాబులు వెనుక స్వామివారి రధం ఊరేగింపుతో వెళ్లడంపై ఇది స్వామి కార్యమా…లేక సొంత కార్యమా…అన్నట్లు భక్తులు వాపోయారు.. ఇదే పరిస్థితి కొనసాగితే ముందు ముందు స్వామి వారి కళ్యాణాల్లో ఎటువంటి కార్యక్రమాలు పెడతారో అన్న సందేహం వ్యక్తం చేశారు భక్తులు.

అయితే, అన్నవరం సత్యదేవుని గ్రామోత్సవాల్లో జరిగిన అపచారంపై టీవీ9 కథనాలు ప్రసారం చేసింది. దాంతో అన్నవరం ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు స్పందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, చైర్మన్, నేను రాత్రి. 1 గంటల వరకు అక్కడే ఉన్నామని చెప్పారు. సిబ్బంది మందేసి చిందులేశారని మీడియా లో వచ్చిందని చూశామన్నారు. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని వివరణ కోరినట్లు తెలిపారు. వారి వివరణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆలయ ఈఒ వేండ్ర త్రినాధరావు.

TTD VIP break darshan: వెంకన్న భక్తులకు ముఖ్య గమనిక..! సామాన్యులకు టీటీడీ పెద్దపీట వేసింది

Telangana : కర్మ భూమిలో పూసిన పూలు, కాళ్ల పారాణితో కాటిబాటపట్టిన పెళ్లికూతుళ్లు..మొన్న సృజన, నేడు లక్ష్మీ..