Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

Andhra Pradesh, Telangana Weather Today: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ శభవార్త చెప్పింది. అల్పపీడనం ప్రభావంతో నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వెల్లడించింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Andhra Pradesh, Telangana Weather Update

Updated on: Aug 21, 2026 | 7:42 AM

రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలోని ఉపరితల ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. ఈ రోజు పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని.. పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిలిపింది. మిగిలిన కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఈ జిల్లాల్లో ఈదురుగాలులు

అలాగే వర్షాల సమయంలో కొన్ని జిల్లాల్లో గంటకు 40 -50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. వాహనాలపై బయటకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సుముద్రంలో భారీ అలలు వచ్చే అవకాశం ఉన్నందుకు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. అలాగే వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల అంచున నిల్చొవద్దని తెలిపింది.

తెలంగాణ వెదర్ అప్‌డేట్

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇవాళ కాస్త మిశ్రమ వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రుతుపవణాల విరామంతో కొన్ని జిల్లాలో తేమ వాతావరణం, మరి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం నేడు హైదరాబాద్‌ సహా వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల్, మెదక్, సిద్దిపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అక్కడక్కడా తేలికపాటి – మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పొడి వాతావరణ కూడా ఉంచే ఛాన్స్ ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us