KS Bharath: సీఎం జగన్‌ని కలిసిన మరో క్రికెటర్.. ముఖ్యమంత్రికి గుర్తుండిపోయే బహుమతి.. భరత్ ఏం మాట్లాడాడంటే..?

|

Jun 16, 2023 | 6:12 AM

Andhra Pradesh: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవలి కాలంలో పలుమార్లు సీఎం జగన్‌ని కలిసిన సంగతి తెలిసిందే. అదే బాటలో మరో ఆటగాడు కూడా గురువారం జగన్‌ని కలిశాడు. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తరఫున వికెట్ కీపర్‌గా..

KS Bharath: సీఎం జగన్‌ని కలిసిన మరో క్రికెటర్.. ముఖ్యమంత్రికి గుర్తుండిపోయే బహుమతి.. భరత్ ఏం మాట్లాడాడంటే..?
KS Bharat with CM Jagan
Follow us on

Andhra Pradesh: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవలి కాలంలో పలుమార్లు సీఎం జగన్‌ని కలిసిన సంగతి తెలిసిందే. అదే బాటలో మరో ఆటగాడు కూడా గురువారం జగన్‌ని కలిశాడు. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తరఫున వికెట్ కీపర్‌గా ఆడిన శ్రీకర్ భరత్ గురువారం జగన్‌ని కలిశాడు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన భరత్.. ఈ సందర్భంగా భారత జట్టులోని ఆటగాళ్లు ఆటోగ్రాఫ్ చేసిన టెస్ట్ జెర్సీని జగన్‌కి బహూకరించాడు. ఆ తర్వాత భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు భరత్‌ను జగన్ అభినందించారు. ఇంకా భవిష్యత్‌లో టీమిండియాకు ఎన్నో విజయాలను సాధించి పెట్టాలని జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

సీఎం జగన్‌కి టీమిండియా టెస్ట్ జెర్సీని అందిస్తున్న భరత్..

అనంతరం భరత్ మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో ఏపీ నుంచి భారత జట్టులో అవకాశం పొందిన తొలి ఆటగాడు తానేనని, అందుకు తాను గర్వపడుతున్నానని చెప్పుకొచ్చాడు. ఇంకా తన లాంటి యువ క్రికెటర్లకు వైఎస్ జగన్ ఎంతో స్పూర్తిగా నిలుస్తారని, ఆయన పాలనలో క్రీడల అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, స్పోర్ట్ ప్రమోషన్ బాగుందని కొనియాడాడు. ఇక జగన్‌ని కలిసిన సమయంలో భరత్‌తో పాటు అతని తల్లిదండ్రులు మంగాదేవి-శ్రీనివాసరావు, కోచ్‌ క్రిష్ణారావు, ఎంపీ మిథున్‌ రెడ్డి కూడా ఉన్నారు.

కాగా, ఇటీవల జరిగిన ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కి బదులుగా వికెట్ కీపర్ స్థానంలో ఎంపికైన భరత్.. ఫైనల్‌లో 5 క్యాచ్‌లు పట్టాడు. ఇంకా బ్యాటింగ్‌లో 28(5, 23) పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..