MLA Nimmala Ramanayudu: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గృహ నిర్బంధం.. పాలకొల్లులో అడ్డుకున్న పోలీసులు

కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పాలకొల్లులో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.

MLA Nimmala Ramanayudu: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గృహ నిర్బంధం.. పాలకొల్లులో అడ్డుకున్న పోలీసులు
Tdp Mla Nimmala Ramanayudu

Updated on: May 24, 2021 | 7:27 AM

MLA Ramanayudu House Arrest: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పాలకొల్లులో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రి, ఆశ్రం ఆసుపత్రులను ఇవాళ రామానాయుడు నేతృత్వంలో సందర్శించాని నిర్ణయించారు. దీంతో ఎమ్మెల్యే బయటకు రాకుండా ముందస్తుగా నిలిపివేశారు.

కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ నేతలు సోమవారం అన్ని జిల్లాల్లో కొవిడ్‌ ఆస్పత్రులను సందర్శించాలని నిర్ణయించింది. కోవిడ్‌ ఆస్పత్రుల్లో వసతులు, రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు, మందులు, భోజనం తదితర అంశాలను పరిశీలిస్తారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also… Farmers Protest : రైతు నిరసనలు తీవ్రతరం.. ఈనెల 26న దేశవ్యాప్త నిరసన.. మద్దతు పలికిన 12 ప్రధానపార్టీలు