Vizag steel plant: పోలీసులు తన దీక్షను భగ్నం చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వానికి ఇది నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని.. దీక్షను కొనసాగిస్తానని చెప్పారు. నిర్వాసితులకు కూడా న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని పల్లా శ్రీనివాసరావు చెప్పారు.
ఈరోజు తెల్లవారుజామున మన ప్రియతమ నేత @Pallasrinivas4u గారు స్టీల్ ప్లాంట్ కై తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేస్తూ ఆసుపత్రికి తరలించారు అయినప్పటికీ హాస్పటల్ లోనే నా దీక్ష కొనసాగిస్తానని విశాఖపట్నం గుండెకాయ అయినటువంటి స్టీల్ ప్లాంట్ ను కాపాడుతానని తెలిపారు. pic.twitter.com/DaXAKOGKjC
— Yeadala Raghu Veer #VisakhaUkkuAndhrulaHakku (@raghu_yeadala) February 16, 2021
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన నిరాహారదీక్షను.. సోమవారం రాత్రి పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. శ్రీనివాస్‌ను దీక్షా శిబిరం నుంచి బలవంతంగా కృషి ఐకాన్ హాస్పిటల్‌కు తరలించారు. పల్లా దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖకు రానుండగా ఆ పర్యటనకు కొద్ది గంటల ముందే పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు.
Also Read:
‘ప్రాణాలు అడ్డు వేసైనా కార్యకర్తలను రక్షించుకుంటా’.. హిందూపురంలో బాలయ్య ఎమోషనల్ కామెంట్స్
రహదారిపై ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు.. ఐదుగురు దుర్మరణం.. మరో ఐదుగురు..