Chandrababu: గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తా.. లేకుంటే ఇవే చివరి ఎన్నికలు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

కర్నూల్ జిల్లాలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టుకు తాను అడ్డు పడుతున్నానని.. దుష్ప్రచారం చేస్తున్నారనీ.. అంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుండి ఉపయోగమేంటి? అంటూ ప్రశ్నించారు.

Chandrababu: గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తా.. లేకుంటే ఇవే చివరి ఎన్నికలు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
Chandrababu Naidu
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 17, 2022 | 12:52 PM

TDP Chief Chandrababu Sensational Comments: ‘‘మీరు గెలిపిస్తే మళ్లీ అసెంబ్లీకి వెళ్తా.. లేదంటే నాకివే చివరి ఎన్నికలు.. టీడీపీని గెలిపించండి, అసెంబ్లీని గౌరవసభ చేస్తా’’.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూల్ జిల్లా (kurnool district) లో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. హైకోర్టుకు తాను అడ్డు పడుతున్నానని.. దుష్ప్రచారం చేస్తున్నారనీ.. అంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుండి ఉపయోగమేంటి? వాళ్లు రాష్ట్రానికి ఏమైనా పనికొస్తున్నారా? అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. అయితే పత్తికొండలో చంద్రబాబుకు వికేంద్రీకరణ సెగ తగిలింది. ర్యాలీగా వస్తుండగా కొందరు స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. బాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు కట్టడి చేయడంతో చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదిలింది.

ఇదిలా ఉంటే .. ఓవైపు మూడు రాజధానుల నినాదాలు.. మరోవైపు చంద్రబాబు పర్యటనతో కర్నూలు జిల్లా పొలిటికల్ హీటెక్కింది. తాను కర్నూలుకు చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. కోడుమూరులో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు. బాబు పర్యటనకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అధికార పార్టీ టార్గెట్‌గా పదునైన విమర్శలు చేశారు చంద్రబాబు.

అమ్మ ఒడి- నాన్న బుడ్డికి సరిపోయిందని.. నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు- మూడు పేకాటల ప్రస్తావన తీసుకొస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే వైసీపీ గుండాలు అరాచకాలు సృష్టిస్తూ కేసులు పెడుతున్నారని.. ఎన్ని కేసులు పెట్టినా తాము భయపడేది లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేననీ.. అప్పుడు వైసీపీ గుండాలను తరిమికొడతామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

కోడుమూరు, దేవనకొండ, పత్తికొండలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. నిన్న రాత్రి ఆదోనిలో బస చేసిన చంద్రబాబు. ఈరోజు ఉదయం 11 గంటలకు రోడ్‌షో తిరిగి ప్రారంభిస్తారు. ఎమ్మిగనూరు వరకు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తారు టీడీపీ అధినేత చంద్రబాబు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో