Chandrababu Naidu: తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్.. జగన్ ఆ విషయాన్ని తెలుసుకోవాలి: చంద్రబాబు

|

May 28, 2022 | 1:35 PM

చంద్రబాబు ఒంగోలులోని అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Chandrababu Naidu: తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్.. జగన్ ఆ విషయాన్ని తెలుసుకోవాలి: చంద్రబాబు
Follow us on

TDP Mahanadu 2022: తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చారని.. తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పేదవారికి, సామాన్యులకు ఏం కావాలో తెలుసుకొని.. అందరికీ సమన్యాయం చేసిన మహా వ్యక్తి ఎన్టీఆర్ అంటూ చంద్రబాబు కొనియాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి (NTR Birth Anniversary) ఉత్సవాల్లో భాగంగా.. చంద్రబాబు ఒంగోలులోని అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకముందు టీడీపీ శ్రేణులతో కలిసి భారీ వాహన ర్యాలీతో చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్‌ చేసి.. చంద్రబాబు మాట్లాడారు.

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారని.. పేదవారికి ఏం కావాలో తెలుసుకుని అందించిన మహా వ్యక్తి అని కొనియాడారు. ఒంగోలులో అభివృద్ధి జరిగిందంటే దామచర్ల జనార్దన్‌ కృషేనంటూ టీడీపీ నేత పేర్కొన్నారు. మహానాడులో భాగంగా సాయంత్రం బహిరంగ సభలో రాష్ట్రం, జిల్లా సమస్యలను ప్రస్తావిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడు సభకు ఎవరూ రాకుండా ఉండాలని బస్సులకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. సభకు రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సాయంత్రం జరిగే బహిరంగ సభకు ఎంతమంది వస్తారో చూడండి అంటూ సవాల్ చేశారు. తప్పుడు రాజకీయాలను రాష్ట్ర ప్రజలు ఆమోదించరని.. ఈ విషయాన్ని జగన్‌ తెలుసుకోవాలని సూచించారు.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మహానాడు రెండో రోజున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఒంగోలులోని మండువవారిపాలెంలో మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ మహానాడు భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..