AP Bandh: ఏపీలో టీడీపీ బంద్‌.. పలుచోట్ల ఉద్రిక్తతలు.. ఇప్పటివరకు ఓవరాల్‌ రిపోర్ట్ ఇది

|

Oct 20, 2021 | 11:48 AM

ఏపీలో జగడం జరుగుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య హైవోల్టేజ్‌ వార్ కొనసాగుతోంది. పట్టాభి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు పెనుదుమారం రేపుతున్నాయి.

AP Bandh: ఏపీలో టీడీపీ బంద్‌.. పలుచోట్ల ఉద్రిక్తతలు.. ఇప్పటివరకు ఓవరాల్‌ రిపోర్ట్ ఇది
Ap Bandh
Follow us on

ఏపీలో జగడం జరుగుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య హైవోల్టేజ్‌ వార్ కొనసాగుతోంది. పట్టాభి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు పెనుదుమారం రేపుతున్నాయి. టీడీపీ బంద్‌, వైసీపీ నిరసనలతో ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి టీడీపీ శ్రేణులు. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేసి అడ్డుకున్నారు పోలీసులు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును వైజాగ్‌లో హౌస్ అరెస్ట్ చేశారు. గృహనిర్బంధం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పోలీసులతో అచ్చెన్నాయుడు వాగ్వాదానికి దిగారు. అచ్చెన్న ఇంటి దగ్గర భారీగా బలగాలను మోహరించారు.

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు, గోరంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా గృహనిర్బంధం ఎలా చేస్తారంటూ బుచ్చయ్యచౌదరి ప్రశ్నించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మాజీ మంత్రి చినరాజప్ప పెద్దాపురంలో నిరసన తెలిపారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి రోడ్లపై ర్యాలీ చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ చినరాజప్ప తన ర్యాలీ కొనసాగించారు. వీధులన్నీ తిరుగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పశ్చిమగోదారి జిల్లా పాలకొల్లులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటి దగ్గర రచ్చ జరిగింది. నిమ్మలను హౌస్ అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులను దాటుకుని గోడ దూకేందుకు నిమ్మల ప్రయత్నించారు. పోలీసులు, నిమ్మల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. చివరికి గేటు విరగ్గొట్టిమరీ నిమ్మల రామానాయుడు ఇంటి నుంచి బయటికి వచ్చారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడలో నానా హంగామా చేశారు. కర్రలతో రోడ్లపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. ఒక చెంపపై కొడితే రెండు చెంపలూ వాయిస్తామంటూ వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. బుద్దా వెంకన్న హంగామాతో అతని ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

బుద్దా వెంకన్న అరెస్ట్‌ సమయంలో తీవ్ర తోపులాట జరిగింది. బుద్దా వెంకన్న అరెస్ట్‌ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. బుద్దా వెంకన్న సైతం తీవ్రంగా ప్రతిఘటించడంతో హైఓల్టేజ్ సీన్ క్రియేట్ అయ్యింది. ఈ తోపులాటలో బుద్దా చొక్కా కూడా చిరిగిపోయింది. చివరికి బుద్దాను బలవంతంగా జీపు ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Also Read:  చెరువులో స్కూల్ బస్సు బోల్తా.. 8 ఏళ్ల విద్యార్థి దుర్మరణం..

బెజవాడలో కర్రలతో బుద్దా వెంకన్న హంగామా.. చెంపలు వాయిస్తామంటూ వార్నింగ్