జైల్లో ఉండి విజయం సాధించిన టీడీపీ మద్దతుదారుడు.. అనుచరులు అద్భుత వ్యూహంతో అదరగొట్టారు

చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ శాతం 81.67 గా నమోదైంది.

జైల్లో ఉండి విజయం సాధించిన టీడీపీ మద్దతుదారుడు..  అనుచరులు అద్భుత వ్యూహంతో అదరగొట్టారు

Updated on: Feb 14, 2021 | 12:46 PM

చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ శాతం 81.67 గా నమోదైంది. రెండో విడతలో మొత్తం 3,328 పంచాయతీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలపై ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. కొన్నిచోట్ల టై అవ్వడంతో.. చిట్టీలు, టాస్ వేసి విజేతలను నిర్ణయించారు. మరికొన్ని చోట్ల స్పల్ప మెజార్టీతో అధికారులు విజయాన్ని చేజిక్కించుకున్నారు.

అయితే, చిత్తూరు జిల్లా కలకడ మండలం నవాబ్‌పేట పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారు గుర్రం శివప్రసాద్‌ నాయుడు 56 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల రూల్స్ బ్రేక్ చేసి, మద్యం తరలిస్తున్నాడని ఆరోపణలతో శివప్రసాద్, మరో ఇద్దరిని గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో ఎన్నికలను పంతంగా తీసుకున్న స్థానిక టీడీపీ నేతలు.. విజయానికి తీవ్రంగా కృషి చేశారు. పక్కా ప్రణాళికతో వార్డుకు ఒక నాయకుడు పనిచేశాడు. దీంతో విజయం సాధ్యమైంది.  పీలేరు జైలు నుంచి పోలీస్‌ ఎస్కార్ట్‌తో శనివారం నవాబ్‌పేటకు వచ్చిన శివప్రసాద్ ‌నాయుడు తన ఓటు వేశారు.

Also Read:

‘పద్మశ్రీ’ జొన్నలగడ్డ గుర్రప్పశెట్టి ఇకలేరు.. అనారోగ్యంతో కన్నుమూసిన బహుకళా కోవిదుడు

Kurnool Road Accident: కర్నూలు ప్రమాదంపై దిగ్భ్రాంతికర విషయాలు.. చిన్న పొరపాటుకు 14 మంది బలి..