Summer Effect: మార్చి మొదట్లోనే మండుతున్న ఎండలు.. బయటకు రావాలంటేనే జంకుతున్న జనం

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. వేసవి(Summer) ప్రారంభంలోనే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండ ప్రభావం ప్రారంభమవుతోంది. దీంతో అడుగు బయటపెట్టాలంటేనే జనం...

Summer Effect: మార్చి మొదట్లోనే మండుతున్న ఎండలు.. బయటకు రావాలంటేనే జంకుతున్న జనం
Sunny

Updated on: Mar 09, 2022 | 7:57 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. వేసవి(Summer) ప్రారంభంలోనే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండ ప్రభావం ప్రారంభమవుతోంది. దీంతో అడుగు బయటపెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చి(March) లోనే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకెంత దారుణ పరిస్థితులు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో(Bay of Bengal) ఇటీవల ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తగ్గింది. దీంతో వేడి పెరిగింది. మధ్యాహ్నం ఉక్కపోత ఉంటోంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాయువ్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పగటి పూట ఎండ ఎక్కువగా ఉంటోంది. రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నాయి.

రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణం పొడిగా మారింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు.. కర్నూలు జిల్లాలోనూ సూర్యుడు సుర్రుమంటున్నాడు. నంద్యాలలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ ఎండ వేడి ఎక్కువగా ఉంది. క్రమేపీ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు.

Also Read

Home Loan: హోమ్ లోన్ తీసుకునే వారికి షాక్.. ఇకపై ఆ రూ. 1.5 లక్షలు మినహాయింపు ఉండదా..!

Gold, Silver Price Today: వెండి ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. స్థిరంగానే పసిడి రేటు..

Viral Photo: బెలూన్స్ అమ్మే యువతి ఓవర్ నైట్‌లోనే బిగ్ స్టార్ అయిపోయింది.. ఫోటోలు చూస్తే ఫిదా అయిపోతారంతే..!