Viral Photo: బెలూన్స్ అమ్మే యువతి ఓవర్ నైట్‌లోనే బిగ్ స్టార్ అయిపోయింది.. ఫోటోలు చూస్తే ఫిదా అయిపోతారంతే..!
Over Night Star: కొన్నేళ్ల కిందట పాకిస్తాన్‌లో టీ అమ్మే వ్యక్తి అర్షద్ ఖాన్ సోషల్ మీడియాను ఆకర్షించి రాత్రి రాత్రే సెలబ్రిటీ అయిపోగా.. నిన్నటికి నిన్న
Over Night Star: కొన్నేళ్ల కిందట పాకిస్తాన్‌లో టీ అమ్మే వ్యక్తి అర్షద్ ఖాన్ సోషల్ మీడియాను ఆకర్షించి రాత్రి రాత్రే సెలబ్రిటీ అయిపోగా.. నిన్నటికి నిన్న రోజూ కూలీ పని చేసుకునే 60 ఏళ్ల మమ్మిక్కా మోడల్‌గా మారిపోయాడు. ఇది ఒక్క సోషల్ మీడియా శక్తివల్లే సాధ్యమైంది. ఆ శక్తి మరొకరి విషయంలోనూ నిరూపితమైంది. రోడ్డుపై బెలూన్లు అమ్ముకునే ఓ యువతిని రాత్రి రాత్రే సంచలనంగా మార్చేసింది సోషల్ మీడియా. అవును మీరు వింటున్నది నిజమే. అప్పటి వరకు బెలూన్స్ అమ్మిన యువతి.. రాత్రి రాత్రి పెద్ద మోడల్‌గా మారిపోయింది. కేరళకు చెందిన అమ్మాయి.. ఓవర్ నైట్ స్టార్‌గా వెలిగిపోతోంది ఇప్పుడు.
రాజస్థానీ కుటుంబానికి చెందిన కిస్బు కేరళలో బెలూన్స్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, ఈ అమ్మాయిపై కెమెరా మెన్ దృష్టి పడింది. ఫోటోగ్రాఫర్ అర్జున్ కృష్ణన్.. కిస్బును కేరళలోని అండలూర్ కావు ఉత్సవంలో బెలూన్స్ అమ్ముకుంటుండగా గుర్తించారు. ఆమె బెలూన్స్ అమ్ముకుంటుండగా.. గుట్టుచప్పుడు కాకుండా ఒక ఫోటోను తీశాడు. ఆ ఫోటోను కిస్బు త్లలికి, కిబ్సుకి చూపించాడు. దాంతో వారిద్దరూ సంతోషించారు. అయితే, ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. రాత్రి రాత్రే సంచలనంగా మారిపోయాయి. నెటిజన్ల నుంచి అద్భుతమైన ప్రతిస్పందన వచ్చింది. కొందరు ఫోటో షూటర్స్.. కిస్బు కుటుంబాన్ని సంప్రదించి మేకోవర్ ఫోటో షూట్ కోసం ఒప్పించారు. వారు ఓకే చెప్పడంతో.. ఫోటో షూటర్స్ కిస్బును అందంగా ముస్తాబు చేసి విభిన్న స్టైల్లో ఫోటోలు తీశారు. రోడ్డుపై బెలూన్స్ అమ్ముకునే ఫోటోలను, ఆఫ్టర్ మేకోవర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. కిస్బు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కిస్బు దశ తిరిగిపోయిందంటూ నెటిజన్లు గుడ్ లక్ చేబుతున్నారు ఆమెకు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Also read:
Zodiac Signs: ఈ 4 రాశులవారు పదేపదే ప్రేమలో పడుతుంటారు.. అందులో మీరున్నారా.!
Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఆ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశం!!
Smart Phones: రూ. 5 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలివే..