Srisailam Dam: పరవళ్లు తొక్కుతూన్న కృష్ణమ్మ.. 10గేట్ల ఎత్తి సాగర్‌కు నీటి విడుదల

|

Jul 31, 2024 | 12:31 AM

శ్రీశైలం జలాశయానికి వరద పోతెత్తుతూనే ఉంది. 10 గేట్లు ఎత్తిన అధికారులు, 2.75 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 3.79 లక్షల క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 3.59 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

Srisailam Dam: పరవళ్లు తొక్కుతూన్న కృష్ణమ్మ.. 10గేట్ల ఎత్తి సాగర్‌కు నీటి విడుదల
Srisailam Dam
Follow us on

శ్రీశైలం జలాశయానికి వరద పోతెత్తుతూనే ఉంది. 10 గేట్లు ఎత్తిన అధికారులు, 2.75 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 3.79 లక్షల క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 3.59 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. కాగా ప్రస్తుత నీటి మట్టం 883.9 అడుగులకు చేరింది. గరిష్ఠ నీటినిల్వ 215.8 టీఎంసీలు.. ప్రస్తుత నీటినిల్వ 209.59 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 21,432 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

మరోవైపు, గేట్లు ఎత్తివేస్తున్నారన్న సమాచారంతో సందర్శకులు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది. వేర్వేరు వ్యూ పాయింట్‌లకు చేరుకుంటున్న సందర్శకులు.. జల దృశ్యాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. జల దృశ్యం అందాలను సెల్‌ఫోన్లలో బంధిస్తు సెల్ఫీలు తీసుకుంటున్నారు.

రిజర్వాయర్‌లో వరుసగా గేట్లు ఎత్తివేస్తుండటంతో సాగర్‌ వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అధికారులు ముందస్తుగా దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. అయితే.. లింగాలగట్టు బ్రిడ్జి కింద యువకులు కారు ఆపారు. అదే సమయంలో డ్యామ్ గేట్లు ఎత్తడంతో కారు నీటిలో మునిగిపోయింది. గమనించిన స్థానికులు అప్రమత్తమై కారులో ఉన్న యువకుల్ని రక్షించారు. ఆ తర్వాత నీళ్లల్లోంచి కారును బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..