Watch: శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. లైవ్ వీడియో..

శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సహా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారితోపాటు.. పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Watch: శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. లైవ్ వీడియో..
Sathya Sai 100th Birth Anniversary

Updated on: Nov 23, 2025 | 10:27 AM

శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సహా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారితోపాటు.. పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హిల్‌వ్యూ స్టేడియంలో జరిగిన కార్యక్రమాల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని కళ్లకుకట్టేలా కళారూపాలను ప్రదర్శించారు. ఏపీ, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఆయా ప్రాంతాల్లోని క్షేత్రాల ప్రాధాన్యతను తెలిపే ఆకృతులతో ర్యాలీ చేశారు. అటు.. పుట్టపర్తి సత్య సాయిబాబా శత జయంతి వేడుకలకు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, గవర్నర్లు కూడా హాజరయ్యారు. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ సేవాకార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

లైవ్ వీడియో చూడండి..

సత్యసాయి శతజయంతి వేడుకల్లో భాగంగా ఇవాళ ప్రశాంతి నిలయంలో మందిరం నుంచి స్వర్ణరథంపై సాయి ప్రతిమను ఊరేగిస్తారు. అక్కడి నుంచి హిల్‌వ్యూ స్టేడియం వరకూ ర్యాలీ ఉంటుంది. ఈ శతజయంతి ఉత్సవాలు ఇవాళ్టితో ముగుస్తున్నాయి.

సేవా మార్గాన్ని ఆచరించి.. బోధించి.. కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసిన సత్యసాయి శతజయంతి వేడుకలు కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి అలాగే విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పుట్టపర్తికి తరలివచ్చారు. దాదాపు 100 దేశాల నుంచి భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతా కూడా తమ స్థాయిని పక్కకుపెట్టి.. సేవా కార్యక్రమాల్లో స్వచ్చందంగా పాల్గొన్నారు.