రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి పట్టాలెక్కిన మరిన్ని స్పెషల్ ట్రైన్స్.!

|

Apr 01, 2021 | 6:33 PM

Special Trains From April 1st: తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ అందించింది. ఇవాళ్టి నుంచి మరిన్ని స్పెషల్ ట్రైన్స్‌....

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి పట్టాలెక్కిన మరిన్ని స్పెషల్ ట్రైన్స్.!
Follow us on

Special Trains From April 1st: తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ అందించింది. ఇవాళ్టి నుంచి మరిన్ని స్పెషల్ ట్రైన్స్‌ పట్టాలెక్కాయి. ఈ లిస్టులో పలు రైళ్లు డైలీ ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా నడవనుండగా.. మరికొన్ని వీక్లీ ట్రైన్స్‌గా నడుస్తాయి. ముఖ్యంగా విశాఖ, విజయవాడ, గుంటూరు జిల్లాల వాసుల కోసం పల్నాడు ఎక్స్‌ప్రెస్, డెల్టా ఎక్స్‌ప్రెస్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఈరోజు నుంచి నడవనున్నాయి.

  • గుంటూరు- వికారాబాద్-గుంటూరు(పల్నాడు ఎక్స్‌ప్రెస్ – 02747) – ఈ ట్రైన్ రోజూ ఉదయం 5.45 గంటలకు గుంటూరు నుంచి బయల్దేరి.. సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, నడికుడి, విష్ణుపురం, సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్ మధ్యాహ్నం 12. 15 గంటలకు చేరుకుంటుంది.

  • ఇక తిరుగు ప్రయాణంలో వికారాబాద్‌(02748)లో మధ్యాహ్నం 2.40 గంటలకు బయల్దేరి సికింద్రాబాద్, నడికుడి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి మీదుగా రాత్రి 9 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.

  • గుంటూరు –విశాఖపట్నం–గుంటూరు : 07239: ఈ ట్రైన్ ఏప్రిల్ 2 నుంచి పట్టాలెక్కనుండగా.. ఆ రోజు ఉదయం 8 గంటలకు గుంటూరులో బయల్దేరి నంబూరు, మంగళగిరి, విజయవాడ మీదుగా విశాఖపట్నం సాయత్రం 4 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణం(07240)లో మరుసటి రోజు విశాఖపట్నంలో ఉదయం 7.10 గంటలకు బయల్దేరి విజయవాడ, మంగళగిరి, నంబూరు మీదుగా గుంటూరు సాయంత్రం 3.20 గంటలకు చేరుకుంటుంది.

  • కాచిగూడ-రేపల్లె-కాచిగూడ(డెల్టా ఎక్స్‌ప్రెస్)- ఈ ట్రైన్ (07625) కాచిగూడలో రాత్రి 10.10 గంటలకు బయల్దేరి.. గుంటూరు, తెనాలి మీదుగా రేపల్లె మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు చేరుకుంటుంది. అలాగే అదే రోజు ఈ ట్రైన్(07626) రాత్రి 10.40 గంటలకు బయల్దేరి తెనాలి, గుంటూరు మీదుగా కాచిగూడ నెక్ట్స్ రోజు ఉదయం 7.05 గంటలకు చేరుకుంటుంది.

ఇవే కాకుండా మరిన్ని ట్రైన్స్ వివరాల కోసం కింద ట్వీట్ చూడండి..

Also Read:

ఏపీలో మరోసారి పడగ విప్పిన కరోనా.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో అత్యధికం.!

LPG Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే.!

అలెర్ట్: ఆధార్‌తో పాన్ కార్డు లింక్.? చివరి తేదీ పొడిగింపు.. వివరాలివే.!

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్.. మరో గుడ్ న్యూస్..!