Tirupati Special Trains: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం పలు ప్రాంతాల నుంచి రైల్వే శాఖ తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) మరో నాలుగు సర్వీసుల ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు తిరుపతి – సికింద్రాబాద్ (Tirupati – Secunderabad) మధ్య నడపనున్నారు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ద.మ రైల్వే గురువారంనాడు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక రైలు (నెం.07481) ఆగస్టు 21, 28 తేదీల్లో (ఆదివారం) రాత్రి 09.10 గం.లకు తిరుపతి నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.30 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే ఎదురుదిశలో ప్రత్యేక రైలు (నెం.07482) ఆగస్టు 22, 28 తేదీల్లో (సోమవారం) సాయంత్రం 04.15 గం.లకు సికింద్రాబాద్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.20 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, కడప, యెర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, మంత్రాలయం, రాయ్‌చూర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 3 టైర్ కోచ్‌లు ఉంటాయని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Special Trains Between Tirupati – Secunderabad @drmgtl @drmsecunderabad @drmhyb pic.twitter.com/d3LvIbfMF1
— South Central Railway (@SCRailwayIndia) August 18, 2022
అలాగే పలు ప్రాంతాల నుంచి తిరుపతికి నడుపుతున్న ప్రత్యేక రైళ్లను సెప్టెంబరు నెలాఖరు వరకు పొడగిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
“Extension of Special Train Services” pic.twitter.com/wMy2CvYWN9
— South Central Railway (@SCRailwayIndia) August 18, 2022
మరిన్ని ఏపీ వార్తలు చదవండి